Movie News

Actor Sushanth: పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో… అప్పుడే చేసుకుంటానంటూ కామెంట్స్!

Actor Sushanth: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందారు. ఇక ఈయన వారసులుగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి పలువురు హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగార్జున మేనల్లుడుగా ఇండస్ట్రీలోకి సుశాంత్ హీరోగా అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.

ఈయన కరెంట్ అడ్డా వంటి పలు సినిమాల ద్వారా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే సినిమాల ఎంపిక విషయంలో కాస్త తడబడటంతో ఈయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయితే ప్రస్తుతం పలు సినిమాలలో ఈయన కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో కీలకపాత్రలో నటించారు.

ఇక ప్రస్తుతం రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాఏప్రిల్ ఏడవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి సుశాంత్ కు తన పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే పెళ్లి గురించి సుశాంత్ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Actor Sushanth: సినిమాలపైనే ఫోకస్..

ఈ సందర్భంగా యాంకర్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించగా అందుకు సుశాంత్ స్పందిస్తూ… పెళ్లి చేసుకుంటే ఇప్పుడు కన్నా చాలా హ్యాపీగా ఉంటాను అని నాకు ఎప్పుడూ అనిపిస్తుందో అప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపారు.అలాగని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండరని తన ఉద్దేశం కాదని,ప్రస్తుతం తన ఫోకస్ పెళ్లిపై లేదని ఇంకా మంచి సినిమాలు చేయాలన్న దానిపైన దృష్టి ఉందని చెబుతూ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఇలా సుశాంత్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago