Samantha: సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిసిస్ వ్యాధి బారినపడి తాను కమిట్ అయిన సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు.
ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్న సిటాడెల్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి సినిమా షూటింగ్లో కూడా బిజీగా మారిపోయారు. ఇక ఈమె నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ హాలీవుడ్లో ప్రియాంక చోప్రా నటించారనే విషయం మనకు తెలిసిందే. దీనిని అదే పేరుతో ఇండియన్ వెర్షన్ లో తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ గురించి ప్రియాంక చోప్రా మాట్లాడుతూ… ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. ఇక ఇందులో నటిస్తున్నటువంటి సమంత నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఒక గొప్ప నటి తనకు నటనలో ఎలాంటి సలహాలు సూచనలు అవసరం లేదని తెలియజేశారు.
తాజాగా తాను వరుణ్ దావన్ని కలిసి ఈ షూటింగ్ గురించి అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంతకు జోడిగా నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ వెబ్ సిరీస్ కోసం సమంత ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా తీసుకున్నారు.ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఈమె పెద్ద ఎత్తున యాక్షన్ సన్నివేశాలలో నటించబోతున్నారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…