“వేణు తొట్టంపూడి” తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. హీరోగా మంచి కామెడీ టైమింగ్ తో తెలుగునాట సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు వేణు తొట్టెంపూడి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు హీరో వేణు. అయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన “స్వయంవరం” సినిమాతో ఎప్పటికీ గుర్తుండిపోయే భారీ విజయాన్ని అందుకున్నాడు.
అంతేకాదు తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీ క్యాటగిరిలో నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తరువాత చిరునవ్వుతో, చెప్పవే చిరుగాలి తనదైన నటనతో అందరినీ అలరించాడు. హీరోగా నటిస్తూనే మరోవైపు హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా సినిమాల్లో కమెడియన్ కం హీరోగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
తెలుగులో దాదాపు 26 సినిమాల్లో నటించిన వేణు 2009లో ‘గోపి గోపిక గోదారి’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అయన కెరీర్ కాస్త వెనుకపడింది. అవకాశాలు రావడం తగ్గిపోయాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ “దమ్ము” చిత్రంలో నటించినా ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. చివరగా వేణు తొట్టెంపూడి నటించిన సినిమా “రామాచారి” ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారవేత్తగా మారిపోయాడు వేణు తొట్టెంపూడి.
అయితే 2013 లోక్ సభ ఎన్నికల్లో అయన బావ నామా నాగేశ్వరరావు తరుపున ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేసాడు. వ్యాపారవేత్తగా రాణిస్తున్న వేణు. గత ఏడాది లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన పేదలకు తనవంతు సహాయం చేస్తూ తన మంచిమనసు చాటుకున్నాడు. అప్పట్లో ఆ పొటోలు వైరల్ అయ్యాయి కూడా. అయితే అవకాశం వస్తే మరోసారి వెండితెరపై తన సత్తా చాటడానికి రెడీ గా ఉన్నానని పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…