Pushpa 2: పుష్ప 2లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న విజయ్ సేతుపతి.. అప్పుడు మిస్సైనా ఇప్పుడు ఫిక్స్?
Pushpa 2: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దొరికిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు.
ఇప్పటికే ఈ సినిమా సీక్వెల్ చిత్రం కూడా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సందడి చేయనున్నట్లు సమాచారం. పార్ట్ 2 లో ఫహద్ ఫసిల్ అల్లు అర్జున్ మధ్య శత్రుత్వం ఉంటుందని సుకుమార్ చెప్పకనే చెప్పేశారు.
అయితే మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నారని ఈయన అల్లు అర్జున్ కు ఫేవర్ గా ఉంటారని సమాచారం వినపడుతుంది. నిజానికి పుష్ప సినిమాలోని ఈయనకు అవకాశం కల్పించినప్పటికీ ఈయన ఆ సమయంలో వివిధ సినిమా షూటింగులతో బిజీగా ఉండటంవల్ల ఈ సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అప్పుడు మిస్సయిన ఈసారి మాత్రం పక్కాగా ఈయన ఈ సినిమాలో నటిస్తున్నారు అనే వార్తలు వినపడుతున్నాయి.
మరి విజయ్ సేతుపతి గురించి వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పనులు ప్రారంభం చేసుకొని వచ్చే ఏడాది చివర్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా భారీ హిట్ అవడంతో ఈ సినిమాపై అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…