Actress Aamani: తెలుగు ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటీమనులలో ఆమని ఒకరు ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆమని తన సినిమాల గురించి పలు విషయాలను తెలియచేశారు.
ముఖ్యంగా ఈమె నటించిన జంబలకడిపంబ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఇవివి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమాలో ఆడవాళ్లు మగవారిగాను మగవారు ఆడవాళ్ళగానో మారడం చాలా కొత్తదనంగా అనిపించింది. ఇప్పటికీ ఈ సినిమా చూసిన చాలా వినోద భరితంగా ఉంటుందని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో నరేష్ ఆమని జంటగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆమని తెలియజేశారు.ఈ సినిమాలో ఆడవారు మగవారిగాను మగవారు ఆడవారిగాను నటించాల్సి వచ్చింది. అయితే ఓ సందర్భంలో తాను సిగరెట్ కాలుస్తూ మందు తాగాల్సిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం డైరెక్టర్ గారు నాకు ముందుగా చెప్పలేదు.కేవలం బాటిల్ ఓపెన్ చేయగానే మందు మొత్తం పైకి పొంగుతుంది జస్ట్ ఒక సిప్ చేస్తే చాలు అని షూటింగ్ కు ముందు డైరెక్టర్ చెప్పారు.
ఇక బాటిల్లో కూల్ డ్రింక్ వేసి ఇస్తారని తాను అనుకున్నాను కానీ నిజంగానే నిజమైన బీర్ బాటిల్ తీసుకువచ్చారని ఆమని తెలిపారు.ఈ సినిమాలోని సన్నివేశం షూట్ చేసే సమయంలో హీరో నరేష్ గారు కూడా ఏం పర్వాలేదు తాగమ్మా అంటూ తనని బీర్ తాగమని ప్రోత్సహించారు అంటూ అప్పటి సంఘటనలను ఆమని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇలా ఆమని చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…