తమిళంలో అద్భుతమైన విజయాన్ని అందుకున్న “అసురన్” సినిమాను తెలుగులో “నారప్ప” గా తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే. తమిళంలో స్టార్ హీరో ధనుష్ చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్ ఎంతో అద్భుతంగా చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రియమణితో పాటు ,ఫ్లాష్ బ్యాక్ లో తమిళ హీరోయిన్ అమ్ము అభిరామి సందడి చేశారు. తమిళంలో కూడా ఈ పాత్రలో ఈమె నటించడం విశేషం.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమె తెలుగు నేర్చుకోవాలనుకున్న సమయంలో మొట్టమొదటిగా చూసిన తెలుగు సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఈ సినిమాలో వెంకటేష్ గారిని చూసి ఎలాగైనా తనతో ఒక సెల్ఫీ దిగాలని భావించినట్లు తెలిపారు.
ఈ విధంగా నారప్ప సినిమాలో తన పక్కన నటించే అవకాశం వస్తుందని ఎప్పుడూ భావించలేదని, ఈ అవకాశం రావడం తన అదృష్టమని తెలిపింది. నారప్ప షూటింగ్ సమయంలో వెంకటేష్ గారితో షూటింగ్ అంటేనే కొద్దిగా కంగారుపడ్డానని ఆ సమయంలో వెంకటేష్ గారు వచ్చి తనకు ఎంతో ధైర్యం చెప్పి షార్ట్ అద్భుతంగా వచ్చేలా సహాయం చేశారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తే నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తన మనసులో ఉన్న మాటను చెప్పేశారు. ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు నటించిన FCUK లో అమ్ము అభిరామి కీలక పాత్రలో నటించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…