ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో తన స్పీడును కాస్త తగ్గించిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన మార్క్ సంపాదించుకున్నారు.అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని,తమ కుటుంబ సభ్యులు చాలా సీరియస్ గా త్రిషకు సంబంధాలు వెతకడం ప్రారంభించారనే వార్తలు జోరుగా వినిపించినప్పటికీ ఇప్పటి వరకూ త్రిష పెళ్లి గురించి ఎలాంటి సమాచారాన్ని అధికారికంగా తెలియజేయడం లేదు. ఈ క్రమంలోనే గతంలో త్రిష , వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తను ప్రేమించింది.అయితే వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకొని పలు మనస్పర్థల కారణంగా వివాహాన్ని రద్దు చేసుకున్నారు.
ఈ విధంగా నిశ్చితార్థం రద్దయిన తరువాత మరి సినిమాలలో బిజీగా మారిన త్రిష తన పెళ్లి గురించి తరచూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె పెళ్లి వ్యవహారం మరోసారి కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.తమిళ స్టార్ దర్శకుడితో త్రిష పెళ్లి జరగబోతుందన్న వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
త్రిష పెళ్లి చేసుకోబోయే ఆ దర్శకుడు ఎవరు? ఏమిటి? అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. అయితే ఈసారైనా త్రిష పెళ్లి పీటలు ఎక్కుతుందా లేకపోతే ఇది కూడా రూమరేనా అనే విషయం తెలియాలంటే త్రిష స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం త్రిష పొన్నాయ్ సెల్వన్, సతురంగ వెట్టాయ్ వంటి సినిమాలలో నటిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…