Actress Geetha : వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఫిదా’. ఈ సినిమాతోనే సాయి పల్లవి తెలుగులో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. సినిమా విడుదల అయ్యి చాలా ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా, అందులోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో చేసిన హీరో హీరోయిన్ లతో పాటు ప్రతి పాత్రలో నటించిన వారికి మంచి గుర్తింపు లభించింది, అంతలా ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. సాయి పల్లవికి మొదటి సినిమా అయినప్పటికీ తన నటన, డాన్స్ తో అభిమానులను సంపాదించుకుంది.

హీరోయిన్ అత్త పాత్ర ద్వారా.. మొదటిసారి సినిమాలో నటించిన గీత…
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమాలో అత్త పాత్రలో నటించిన గీత గారు మరెవరో కాదు.. దర్శకుడు, నటుడు అయిన తరుణ్ భాస్కర్ కి అమ్మ గారు. ‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ స్నేహితుడు కావడం నిర్మాత రాజ్ కందుకూరి అవకాశం ఇవ్వడంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు కూడా సంపాదించాడు.

గీత గారు తరుణ్ భాస్కర్ కు అమ్మ గారు అయినప్పటికీ తన కొడుకు ద్వారా కాకుండా తాను సొంతంగా సినిమాలో అవకాశం సంపాదించికుంది. ఫిదా సినిమాతో తొలిసారి తెర మీద కనిపించి తన సహజ నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఫిదా సినిమా తరువాత మరికొన్ని సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు చాలామందికి గీత గారు తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మగారు అన్న విషయం తెలియకపోవడం విశేషం.































