Actress Kalpalatha : భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరుకి చెందిన గార్లపాటి కల్పలత గారు వేదం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత పలు సినిమాల్లో అత్త, అమ్మ వంటి పాత్రలతో సాఫ్ట్ రోల్స్ చేస్తూ కనిపించిన కల్పలత గారు బాహుబలి రెండు బాగాల్లోనూ కనిపించారు. ఇక ఇటీవల వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో పుష్ప తల్లి పార్వతమ్మ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ సంఘటనలను పంచుకున్నారు.
నా వయసు తెలిసి బన్నీ గారు షాక్ అయ్యారు…
పుష్ప సినిమాలో పుష్పారాజ్ తల్లిని కొత్త కారులో ఎక్కించుకుని వెళ్లే సీన్ సమయంలో అల్లు అర్జున్ కల్పలత గారితో మాట్లాడిన విషయాలను ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బన్నీ గారు కల్పలత గారిని మీ వయసు ఎంత అమ్మ అని అడిగారట. నాకు 41 సంవత్సరాలు అని చెప్పగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే నాకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరూ అమెరికాలో జాబ్ చేస్తున్నారు అని చెప్పగానే ఆయన షాక్ అయ్యారు.
మీరు నాకన్నా నాలుగేళ్ళే పెద్దవారు అంటూ షాక్ అయ్యారట. ఇక సుకుమార్ దగ్గరికి వెళ్లి మా అమ్మ నాకన్నా నాలుగేళ్ళే పెద్ధ అంటూ నవ్వారట. కల్పలత గారిని చూసినప్పుడంతా ఆ విషయం గుర్తు తెచ్చుకుని నవ్వేవారట. ఇక డైరెక్టర్ సుకుమార్ గారు వచ్చి నా వయసు చెప్పమంటావా అంటూ నవ్వేవారట. పదనాలుగేళ్ళకే పెళ్ళైపోవడం వల్ల చిన్న వయసులోనే ఇద్దరు ఆడపిల్లలను పెంచానంటూ కల్పలత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…