సమంత నాగ చైతన్యల విడాకుల విషయం కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నాం అని చెప్పడంతో ఎంతోమంది అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే సమంత చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటని అభిమానులు ఆరా తీస్తున్నారు.
సమంత చైతన్య విడిపోవడానికి ఆమె సినిమాలలో బోల్డ్ పాత్రలో నటించడమే కారణమని కొందరు భావించగా మరికొందరు సమంత స్టైలిష్ ప్రీతమ్ ప్రధాన కారణం అని మరి కొందరు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా సమంత విడాకుల విషయం విన్న పలువురు సెలబ్రిటీలు వీరి విడాకులపై స్పందిస్తూ తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ సమంత చైతన్యల విడాకుల విషయం పై స్పందించారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయని వారి గురించి అనవసరమైన తప్పుడు ప్రచారాలు చేసి వారి ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని ఈ సందర్భంగా ఆమె కోరారు.
ఈ క్రమంలోనే ఖుష్బు తన ట్విట్ లో భాగంగా.. భార్య భర్తల మధ్య ఏం గొడవ జరిగిందనే విషయం వారికి మాత్రమే తెలుసు. వారిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. అయితే వారి ప్రైవసీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి వారు ఈ ఘటన నుంచి కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వండి అంటూ ఖుష్బూ ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక వీరి విడాకుల విషయం గురించి వర్మ, కంగనా రనౌత్, ప్రకాష్ రాజ్, నటి సురేఖ వాణి వంటి వారు స్పందిస్తూ తమ దైన శైలిలో కామెంట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…