ఒకప్పుడు పాఠశాలలకు కాలేజీలకు సెల్ ఫోన్ అనుమతి ఉండేది కాదు. అయితే కరోనా పూర్తిగా అన్ని నియమ నిబంధనలను మార్చేసింది. ఇప్పుడు తరగతి గదులు వినాలంటే సెల్ ఫోన్ ఎంతో ముఖ్యంగా మారిపోయింది. కరోనా కారణం వల్ల పాఠశాలలు మూతబడటం చేతే పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే పిల్లలు నిత్యం సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని పూర్తిగా సెల్ ఫోన్ కి అంకితమయ్యారు. కొంత మంది పిల్లలకు అది వ్యసనంగా మారడం చేత పిల్లలను అదుపు చేయాలని తల్లిదండ్రులు పిల్లలను మందలించడంతో పిల్లలు ఎంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి.
తాజాగా ఇలాంటి ఘటన మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్ లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది స్థానికంగా నివసించే ఓ పదో తరగతి విద్యార్థి నిత్యం సెల్ ఫోన్ కి బానిస అయ్యి సెల్ ఫోన్ లో గేమ్ ఆడుతుడడంతో తన తండ్రి తనని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఘోరమైన నిర్ణయాన్ని తీసుకుంది.
అందరూ పడుకొని ఉండగా బాలిక ఇంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…