Actress Meena : చేప కళ్ళ మీనా దక్షిణాదిన పరిచయం అక్కర్లేని పేరు. 90దశకంలో టాప్ హీరోయిన్స్ లో ఒకరు. తన అమాయకపు మొహంతో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో అభిమానులను సంపాదించుకుంది. తెలుగు కన్నడ, తమిళం, మలయాళం మొత్తం. అన్ని సౌత్ భాషల్లో నటించి మెప్పించింది. ఇక అవకాశాలు సన్నగిల్లాక ప్రేమించి డాక్టర్ ను పెళ్లిచేసుకుంది.
ఇక తన కూతురు నైనిక కూడా మీనా లాగానే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తోంది. పెళ్లి తర్వాత సినిమాల్లో తగ్గించినా మీనా ఇటీవల మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్ళీ సినిమాల్లో చెల్లి, తల్లి పాత్రలతో బిజీగా ఉంది మీనా. ఇక మీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది . ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంది . తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
గర్భవతి గా ఉన్న గెటప్ లో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకప్పుడు ఈ ప్రెగ్నెంట్ గెటప్ వేసుకోవడం చాలా ఈజీగా ఉండేదని, ఇప్పుడు అంతా మారిపోయిందని చెప్పింది. అప్పట్లో కవర్ చేసుకోవడానికి హెవీ చీరలను ధరించేవాళ్లమని కానీ ఇప్పుడు లుక్ కే ప్రాధాన్యత ఇస్తున్నారని, నేచురల్ గా కనిపించడానికి షిఫాన్ చీరలను కూడా ఇపుడు ధరించవచ్చు అంటూ వీడియోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలు ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి. కొంత మంది శుభాకాంక్షలు చెబుతుంటే మరికొందరు తన నెక్స్ట్ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…