మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘గాడ్ ఫాదర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం విధితమే. హై ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రాబోతోన్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతోన్నారు.
ఈ సినిమా మళయాళంలో సూపర్ హిట్ కొట్టిన లూసీఫర్ కు రిమేక్. అందులో మోహన్ లాల్ హీరోగా నటించగా.. అతడి స్థానంలో తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హారో పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో చెల్లి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. మళయాళంలో మోహన్ లాల్ కు చెల్లిగా మంజు వారియర్ చేసింది. తెలుగులో లేడీ సూపర్ స్టార్ నయనతార చేస్తోంది.
అయితే మంజు వారియర్ కు భర్తగా మళయాళంలో వివేక్ ఒబెరాయ్ పోషించగా.. తెలుగులో ఆ పాత్రను సత్యదేవ్ ను ఎంచుకున్నారు. అయితే దీనిపైనే నయనతార అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నా భర్త పాత్రకు పవర్ ఫుల్ హీరోని కాకుండా..పాపులారిటీ లేని సత్యదేవ్ ను ఎంపిక చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించి.. అతడిని మార్చడం కుదరదని.. చిరంజీవి అతడిని ఫైనల్ చేశాడని ఆమెకు చెప్పారట.
సత్యదేవ్ కూడా మంచి నటుడు అని.. విభిన్న పాత్రలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని.. చిత్ర యూనిట్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇది ఎంత వరకు నిజమో తెలియుదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది. సైరా చిత్రంతో చిరంజీవి నయనతార అందరినీ మెప్పించారు. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…