అలనాటి బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని పలు అంతర్జాతీయ సినిమాలు అయినా గాంధీ , మర్చంట్ ఐవరీ, కాటన్ మేరీ వంటి విజయవంతమైన సినిమాల్లో తన సత్తా చాటింది. టెలివిజన్ రంగంలో పలు పాపులర్ టీవీ సిరీస్‌లకు దర్శకత్వం వహించి ఉన్నతమైన అవార్డులను పొందిన నీనా గుప్తా బాలీవుడ్లోకి “అధర్షిలా”సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి “వోహ్ చోక్రీకి “మూవీతో ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది.
నీనా గుప్తా వెండితెరపై ఎంత అద్భుతంగా రాణించిదో నిజజీవితంలో అంతకంటే ఎక్కువ ఆటుపోట్లను ఎదుర్కొది.మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో సహజీవనం చేసి గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయారు నీనాగుప్తా.తర్వాత మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే.
తాజాగా నీనాగుప్తా తన ఆత్మకథ “సచ్ కహున్” పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ బయోగ్రఫి ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నీనాగుప్తా తన ఆత్మకథకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. అలాగే చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి తప్పుడు వార్తలు చాలా రాశారని, కెరీర్ ప్రారంభంలో సేల్స్ గర్ల్ గా పని చేసినట్లు వచ్చిన తప్పుడు వార్తలను గురించి ప్రస్తావించారు.
నీనా గుప్తా మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను శ్యామ్ ఆహుజా షాప్ లో సేల్స్ గర్ల్ గా చేరినట్లు ఓ ప్రముఖ మ్యాగజైన్లో వార్తలు వచ్చినట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది. విశేషం ఏమిటంటే నాకు నిజంగా శ్యామ్ ఆహుజా ఎవరో తెలియదు. ఆ షాప్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇలా నా మీద ఆ పత్రికలు చాలా తప్పుడు వార్తలు సృష్టించి నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. కొన్ని కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమైన నీనా గుప్త2018 లో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చి “వీరే డి వెడ్డింగ్” మరియు “బధాయ్ హో”వంటి సినిమాలతో అద్భుతమైన ప్రజాదరణ పొందింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…