Actress Pavithra Lokesh : మళ్ళీ పెళ్లి అంటూ గోల చేస్తున్న జంట నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సీరియల్ ను తలపించేలా రోజుకో కొత్త ఎపిసోడ్ తో అందరినీ అలరించింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్, నరేష్ వీరి ముగ్గురి గోల సోషల్ మీడియానూపేసింది. అయితే అదంతా సద్ధుమణిగింది అనే లోపు ఆ ఇష్యూ అంతా సినిమా రూపంలో తెచ్చాడు నరేష్. సినిమా గురించి ప్రమోషన్స్ ఏమో గాని పవిత్ర తో ఉన్న ప్రేమ గురించి ఎక్కువగా ఇంటర్వ్యూలో ప్రమోట్ చేసుకుంటున్నాడు. వారిద్దరు అసలు ఎలా కనెక్ట్ అయ్యారు ఎలా ప్రపోజ్ చేసుకున్నారు వంటి విషయాలను ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.
నరేష్ చెప్పినా నేను చెప్పకపోడానికి కారణం…
ఇద్దరి గురించి ఒకరికి ఒకరు వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నాక మా మధ్య మరింత స్నేహం పెరిగింది అంటూ చెప్పారు నరేష్, పవిత్ర లోకేష్. అలా మొదట నరేష్ గారే సమ్మోహనం సినిమా టైములో పవిత్ర గారికి ఐ లవ్ యూ చెప్పగా పవిత్ర లోకేష్ సమాధానం చెప్పకుండా కీప్ లవింగ్ మీ అంటూ చెప్పి సైలెంట్ అయిపోయారట. ఆ రోజంతా ఆమె చెప్పిందానికి అర్థం ఏమిటని అర్థం కాక నిద్రపట్టలేదట నరేష్ గారికి.
అయితే పవిత్ర ఎందుకు వెంటనే నరేష్ గారి ప్రేమను ఓకే చేయలేదనే ప్రశ్న అడిగినపుడు మాది టీనేజీ లవ్ కాదు అలాగే మా బాధ్యతలు మా మీద చాలా ఉన్నాయి అందుకే సమయం తీసుకున్నాను. అలాగే సమాజం వైపు నుండి కూడా నేను ఆలోచించాలి కదా అంటూ చెప్పారు. అయితే మనసులో ఉన్న ఎమోషన్ ని ఆపలేము అందుకే కొద్ది రోజులకే నా మనసులోని మాటను చెప్పేసాను అంటూ పవిత్ర తన గురించి చెప్పారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…