సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో తల్లి, వదిన పాత్రలో, చెల్లెలు పాత్రలో నటించిన పవిత్రా లోకేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈ నటి ఆర్థికంగా మోసపోయారని టాలీవుడ్ సమాచారం. పవిత్రా లోకేష్ దాదాపు 60 లక్షల రూపాయల వరకు జిఎస్టి చెల్లింపులు చెల్లించని నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి ఈ విధంగా నోటీసులు రావడంతో అసలు విషయం బయట పడినట్లు పవిత్ర లోకేష్ తెలిపారు.
కెరియర్ పరంగా తాను ఎంతో బిజీగా ఉండటం చేత ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజర్ కి అప్పగించారు. ఈ క్రమంలోనే తన మేనేజర్ జీఎస్టీ లు చెల్లించకుండా డబ్బును దోచుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయని, మేనేజర్ తనను ఆర్థికంగా చాలా మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విధంగా ప్రభుత్వం నుంచి నటి పవిత్రా లోకేష్ కు నోటీసులు రావడం చేత సుమారు 60 లక్షల వరకు జీఎస్టీలు చెల్లిందని టాలీవుడ్ సమాచారం. ఈ విధంగా కేవలం పవిత్ర లోకేష్ మాత్రమే కాకుండా ఎందరో సెలబ్రిటీలు బిజీగా ఉండడం చేత వారి ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజర్ చేతిలోపెట్టి ఆర్థికంగా లక్షలలో మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.
గతంలో యాంకర్ అనసూయ కూడా ఆర్థిక లావాదేవీలన్నీ మేనేజర్ చేతిలో పెట్టి భారీగా మోసపోయానని అయితే ప్రభుత్వం నుంచి కట్టాల్సిన జిఎస్టి లకు సంబంధించిన నోటీసులు వచ్చేవరకు తాను మోసపోయానని గ్రహించలేదని ఆ తరువాత డబ్బులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలమని తెలిపారు.ఈ విధంగా మేనేజర్లు మోసం చేయడంతో ఎంతోమంది నటీనటులు అప్పులపాలైన వారు కూడా ఉన్నారని చెప్పవచ్చు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…