నటి గీతాసింగ్ అనడం కంటే.. “కితకితలు” హీరోయిన్ అంటే అందరికీ వెంటనే గుర్తొస్తారు. కితకితలు సినిమా ద్వారా ఎంతో మందిని నవ్వించిన నటి గీతాసింగ్ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. కితకితలు సినిమాలో లావుగా ఉండి అందరినీ నవ్వించినదో ఇప్పుడు అదే లావు తనని ఏడిపిస్తుందని చెప్పవచ్చు. తాజాగా నటి గీతాసింగ్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలో బయట తనపై వచ్చే కామెంట్స్, ట్రోలింగ్ గురించి చెబుతూ గీత సింగ్ ఎమోషనల్ అయ్యారు.
ప్రతివారంలాగే ఈ వారం క్యాష్ ప్రోగ్రామ్ కు అంబటి శ్రీనివాస్, బాలాదిత్య, గీతా సింగ్, సునీల్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఎప్పుడు మాదిరిగానే క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చే గెస్టులతో సుమ చేసే సరదా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన టైమింగ్ లో సరైన పంచులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన గెస్టు లతో నవ్వులు పూయించిన సుమ గీతాసింగ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా భావోద్వేగం అయ్యారు.
ఈ క్రమంలోనే గీతా సింగ్ ను ఉద్దేశించి.. ఏంటి ఈ మధ్య చాలా భాధపడ్డారంట అని సుమ అడగడంతో ఒక్కసారిగా గీతా సింగ్ ఎమోషనల్ అయ్యారు. తన బాడీ షేమింగ్ పై బయట పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని, ఎక్కడికి వెళ్లిన మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు..?ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ప్రశ్నలు ఎదురవుతున్నాయని భావోద్వేగం అయ్యారు.
గీతా సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాకు అవకాశాలు లేవు. అందుకు కారణం నేను లావుగా ఉండడమే, ఇప్పటికీ అవకాశాలు కోసం తిరుగుతూ ఉన్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉన్నాము. నా పెళ్లి విషయంలో నా కుటుంబానికి లేని బాధ మీకు ఎందుకంటూ గీత గట్టిగా స్పందించారు.ఈ విషయం గురించి చాలా మంది కావాలనే కామెంట్స్ చేయడమే కాకుండా బయటకు వెళ్ళినా ఇదే ప్రశ్ననని తరచు అడగటం ఎంతో ఇబ్బంది కరంగా ఉందని తన మనసులోని బాధను బయటపెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…