Actress Prema: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ధర్మచక్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి ప్రేమ గురించి అందరికీ సుపరిచితమే. దేవి ఓంకారం మావిడ కలెక్టర్ వంటి పలు సినిమాలలో నటించి పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అటువంటి ప్రేమ చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరం అయిపోయారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సందడి చేశారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ప్రేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరీర్ గురించి వ్యక్తిగత విషయాలు గురించి తెలియజేశారు.
అలాగే గతంలో ఈమె నటుడు ఉపేంద్రతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై కూడా ప్రేమ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఉపేంద్ర లవ్ ఎఫైర్ గురించి ఈమెను ప్రశ్నించగా… ఇలాంటి వార్తలు రాసిన వారిని అడగాలి అంటూ కామెంట్స్ చేశారు. అది కేవలం గాసిప్ మాత్రమేనని కొట్టిపారేశారు. ఆ సమయంలో తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉండేదని తెలిపారు.
సాధారణంగా ఇండస్ట్రీలో ఒక హీరో లేదా హీరోయిన్ కు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిన సమయంలో వారి గురించి ఇలాంటి పుకార్లు రావడం సర్వసాధారణం.ఒక వ్యక్తి గురించి పాజిటివ్ ధోరణిలో మాట్లాడేవారు ఉంటారు. నెగిటివ్ ధోరణిలో మాట్లాడేవారు ఉంటారు. అయితే దేనినైనా మనం తీసుకొని ముందుకు ధైర్యంగా నడవాలి అంటూ ఉపేంద్రతో లవ్ ఎఫైర్స్ అన్ని అవాస్తవాలేనని కొట్టి పారేశారు. ఇలా ప్రేమ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…