Categories: FeaturedMovie News

Tiger Radha Prashanthi : ఆ టైంలో కావాలనే నా ఇల్లు తగలబెట్టారు…: టైగర్ రాధా ప్రశాంతి

Tiger Radha Prashanthi : అవకాశాలు వచ్చినా అవి మన వరకు చేరాలన్నా అదృష్టం ఉండాలి. ముఖ్యంగా సినిమా రంగంలో ఒక ఆఫర్ మనకు వచ్చినా అది చెజారితే జరిగే నష్టం మన కెరీర్ మీద ప్రభావం చూపుతుంది. అలానే సహాయక పాత్రలతో పేరు తెచ్చుకున్న రాధా ప్రశాంతి విషయంలో కూడా జరిగింది. శ్రీకాకుళం పార్లకిమిడి పక్కన గ్రామంలో జన్మించిన రాధా ప్రశాంతి ఒరిస్సా రాష్ట్రం లోని గ్రామంలో జన్మించింది. అయితే శ్రీకాకుళం అనగానే గుర్తొచ్చేది కళాకారులు. అలా చిన్నతనం నుండే నాటకాలు వేసిన అనుభవం ఉన్న రాధా ప్రశాంతి కి మొదట జగపతి ఆర్ట్స్ బ్యానర్ లో జగపతి బాబు మొదటి సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం రాగా సెలెక్ట్ అయ్యాక బైక్ లో వెళ్తూ ఆక్సిడెంట్ అవడం వల్ల అవకాశం మిస్ అయిందట. అలా కొన్ని అవకాశాలు కెరీర్ మీదే ప్రభావం చూపుతాయి అంటూ చెబుతున్నారు రాధా ప్రశాంతి.

కావాలనే ఇల్లు తగులబెట్టారు…

మొదటి నుండి రామకృష్ణ మఠంలో ధ్యానం చేసుకునే అలవాటు ఉన్న రాధా ప్రశాంతి గారు లాక్ డౌన్ సమయంలో అక్కడే ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తర్ఫీదు తీసుకునేవారట. ఇక భర్త, పిల్లలు లాక్ డౌన్ అని సొంతూరు వెళ్ళిపోగా తాను మాత్రం ఉండటంతో ఆ సమయంలో ఎవరో కావాలనే ఇల్లు తగులబెట్టారంటూ చెప్పారు. ఫ్లోర్ లో తన ఇల్లు మాత్రమే కాలిపోయిందని అపుడు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి అంటూ చెప్పారు.

ఇక చేసేదేమి లేక రామకృష్ణ మఠంకి వెళ్లి, అక్కడే ఉండి పుస్తకాలు చదువుకుంటూ కొద్ది కాలం ఉండిపోయాను. జరిగినదాని గురించి ఆలోచిస్తే వచ్చేదేమి లేదని అక్కడ చెబుతారు, మనసు ప్రశాంతత అలాగే ఆరోగ్యం రెండూ పాడవుతాయి అంటూ అక్కడ చెప్తారు. అందుకే కావాలనే నా ఇల్లు తగలుబెట్టిన వాళ్ళ గురించి నేను ఆలోచించలేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago