Movie News

Actress Prema: త్రివిక్రమ్ నమ్మించి మోసం చేసారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి ప్రేమ !

Actress Prema: కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నటువంటి ప్రేమ ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ప్రేమ అనంతరం పలు సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఈమె దేవత పాత్రలలో నటించి నిజంగానే దేవత అని భావన కలిగేలా నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.

ఈ విధంగా ప్రేమ ఎంత తొందరగా స్టార్ హీరోయిన్ అయిందో అంతే తొందరగా ఇండస్ట్రీలో ఫెయిడౌట్ అయింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ఈమె సహాయనటిగా మారిపోయారు.ఈ విధంగా ప్రేమ సహాయ నటిగా మారిపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నటిగా కొనసాగుతున్న నేను సహాయనిటిగా మారడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ఈమె దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాను హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో చిరునవ్వుతో అనే సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ సినిమాలో తన పాత్ర బావతో పెళ్లిని తిరస్కరించి ఓ మోసగాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించాను.అయితే ఈ సినిమా కథ విన్న సమయంలో ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఉందా అని ప్రశ్నించగా త్రివిక్రమ్ మాత్రం కథ మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది అంటూ నన్ను బలవంతంగా ఈ పాత్రలో నటించడానికి ఒప్పించారు.

త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశారు…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్ర గురించి అంతలా చెప్పడంతో కేవలం ఆయనపై నమ్మకంతోనే చిరునవ్వుతో సినిమాలో చేశానని ఈమె వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కాగా తన పాత్ర హీరోయిన్ పాత్ర కాదని సహాయ నటి పాత్ర అని తెలిసింది.ఈ సినిమా అనంతరం నాకు సహాయ నటి పాత్రలలో అవకాశాలు వస్తున్నాయని కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తాను హీరోయిన్ నుంచి సహాయ నటిగా మారిపోయాను అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago