Actress Prema: కన్నడ చిత్ర పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నటువంటి ప్రేమ ధర్మచక్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి ప్రేమ అనంతరం పలు సినిమాలలో నటించారు. ముఖ్యంగా ఈమె దేవత పాత్రలలో నటించి నిజంగానే దేవత అని భావన కలిగేలా నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు.

ఈ విధంగా ప్రేమ ఎంత తొందరగా స్టార్ హీరోయిన్ అయిందో అంతే తొందరగా ఇండస్ట్రీలో ఫెయిడౌట్ అయింది. హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో ఈమె సహాయనటిగా మారిపోయారు.ఈ విధంగా ప్రేమ సహాయ నటిగా మారిపోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నటిగా కొనసాగుతున్న నేను సహాయనిటిగా మారడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ఈమె దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాను హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో చిరునవ్వుతో అనే సినిమాకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ సినిమాలో తన పాత్ర బావతో పెళ్లిని తిరస్కరించి ఓ మోసగాడిని పెళ్లి చేసుకునే అమ్మాయి పాత్రలో నటించాను.అయితే ఈ సినిమా కథ విన్న సమయంలో ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఉందా అని ప్రశ్నించగా త్రివిక్రమ్ మాత్రం కథ మొత్తం నీ చుట్టూ తిరుగుతుంది అంటూ నన్ను బలవంతంగా ఈ పాత్రలో నటించడానికి ఒప్పించారు.

త్రివిక్రమ్ నమ్మించి మోసం చేశారు…
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాత్ర గురించి అంతలా చెప్పడంతో కేవలం ఆయనపై నమ్మకంతోనే చిరునవ్వుతో సినిమాలో చేశానని ఈమె వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా విడుదల కాగా తన పాత్ర హీరోయిన్ పాత్ర కాదని సహాయ నటి పాత్ర అని తెలిసింది.ఈ సినిమా అనంతరం నాకు సహాయ నటి పాత్రలలో అవకాశాలు వస్తున్నాయని కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తాను హీరోయిన్ నుంచి సహాయ నటిగా మారిపోయాను అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.































