Movie News

వెబ్ సిరీస్ లో విలన్ పాత్రలో నటి.. ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, ఇతర భాషలలో పలు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న నటి రాశీ ఖన్నా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా,డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బాగా ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ” ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్
ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతితో పాటు ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.

తాజాగా రాశీ ఖన్నా ప్రస్తుతం అజయ్ దేవగన్ నటించనున్న రుద్ర అనే టైటిల్ తో ప్రచారం జరుగుతున్న వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో చేయడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ ఫేమ్ ఎమ్. రాజేష్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు.ఈ వెబ్ సిరీస్ ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా రూపొందుతున్నగా ఇందులో రాశి ఖన్నా విలన్ పాత్రలో నటించనుందని సమాచారం వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ నెల 21వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు తెలియజేశారు.

ఇకపోతే రాశిఖన్నా ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కినేని నాగచైతన్య సరసన “థాంక్యూ” సినిమాలో, గోపీచంద్ సరసన”పక్కా కమర్షియల్”వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కోళీవుడ్ ఇండస్ట్రీలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. తమిళనాడులో కొత్త చర్చకు తెర..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…

1 second ago

బంగారం కొనాలనుకునేవారికి షాక్.. ఒక్కరోజులోనే భారీ పెరుగుదల!

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…

7 minutes ago

రెండేళ్ల జ్ఞానేశ్వరి ఎక్కడ? తునిలో మిస్టరీగా మారిన చిన్నారి అదృశ్యం..

కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…

19 minutes ago

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

22 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

23 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago