యాదాద్రి ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాన ఆలయం మండపాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి ప్రత్యేక విద్యుత్ కాంతులను అమర్చిన అధికారులు వాటిని ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయం గురువారం రాత్రి సమయంలో ఏకంగా స్వర్ణ దేవాలయాన్ని తలపించింది.
బంగారు వర్ణ కాంతులతో ఆలయ ప్రధాన గోపురం, మండపాలు ఈ విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా కనువిందు చేసింది. ఈ క్రమంలోనే ఆలయం ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించగా ఆలయ ప్రాంగణం మొత్తం స్వర్ణ కాంతులు విరజిమ్మింది. ఈ క్రమంలోనే ఆలయంలో పలు మండపాలకు బెంగుళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు యాదాద్రి ఆలయం కొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వీలైనంత త్వరలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…