యాదాద్రి ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణ పనులను వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాన ఆలయం మండపాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఆలయానికి ప్రత్యేక విద్యుత్ కాంతులను అమర్చిన అధికారులు వాటిని ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయం గురువారం రాత్రి సమయంలో ఏకంగా స్వర్ణ దేవాలయాన్ని తలపించింది.

బంగారు వర్ణ కాంతులతో ఆలయ ప్రధాన గోపురం, మండపాలు ఈ విద్యుత్ కాంతులతో ఎంతో అందంగా కనువిందు చేసింది. ఈ క్రమంలోనే ఆలయం ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేసి ట్రయల్ రన్ నిర్వహించగా ఆలయ ప్రాంగణం మొత్తం స్వర్ణ కాంతులు విరజిమ్మింది. ఈ క్రమంలోనే ఆలయంలో పలు మండపాలకు బెంగుళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు యాదాద్రి ఆలయం కొత్త వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటికే ఈ ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వీలైనంత త్వరలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here