ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు, ఇతర భాషలలో పలు సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న నటి రాశీ ఖన్నా కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా,డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై బాగా ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ” ది ఫ్యామిలీ మెన్” వెబ్ సిరీస్
ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే దర్శకద్వయం రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్, విజయ్‌ సేతుపతితో పాటు ఓ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.

తాజాగా రాశీ ఖన్నా ప్రస్తుతం అజయ్ దేవగన్ నటించనున్న రుద్ర అనే టైటిల్ తో ప్రచారం జరుగుతున్న వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో చేయడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ ఫేమ్ ఎమ్. రాజేష్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించనున్నారు.ఈ వెబ్ సిరీస్ ఇంగ్లిష్‌ సైకలాజికల్‌ క్రైమ్‌ డ్రామా ‘లూథర్‌’ ఆధారంగా రూపొందుతున్నగా ఇందులో రాశి ఖన్నా విలన్ పాత్రలో నటించనుందని సమాచారం వినిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ నెల 21వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు తెలియజేశారు.

ఇకపోతే రాశిఖన్నా ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అక్కినేని నాగచైతన్య సరసన “థాంక్యూ” సినిమాలో, గోపీచంద్ సరసన”పక్కా కమర్షియల్”వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే కోళీవుడ్ ఇండస్ట్రీలో మరో మూడు క్రేజీ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here