Actress Revathi: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో వివిధ భాషలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రేవతి ఒకరు. ఇలా తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే అగ్రతారగ పేరు సంపాదించుకున్న రేవతి ప్రస్తుతం యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
ఈ విధంగా తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలో నటించే సందడి చేశారు. ఒకానొక సమయంలో ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతుండగానే నటుడు సురేష్ చంద్ర మీనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వివాహమనంతరం కూడా ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా ఈమె నటనకు ఎన్నో అవార్డులు సత్కారాలు కూడా లభించాయి.
ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్నటువంటి ఈమె పిల్లలకు జన్మనిస్తే తన అందం దెబ్బతింటుందని తన కెరియర్ అంతటితో ముగుస్తుందని భావించి పిల్లలను కనకుండా ఉన్నారు ఈ క్రమంలోనే తన భర్తకు తనకు మధ్య మనస్పర్ధలు రావడంతో సుమారు 10 సంవత్సరాల పాటు దూరంగా ఉన్నటువంటి ఈ దంపతులు చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ విధంగా భర్తకు దూరంగా ఉన్నప్పటికీ ఈమెకి అమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక కలగడంతో ఏకంగా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డలను కనాలంటే భర్త ఉండాల్సిన అవసరం లేదని ఈ నటి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చారు.తన కుమార్తెకు మహి అని నామకరణం చేసిన రేవతి తన కూతురు ఆలనా పాలన చూసుకుంటూ అమ్మగా కూతురి ప్రేమను ఆస్వాదిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…