Anchor Sowmya Rao: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ అనసూయ కూడా మంచి గుర్తింపు పొందడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాలతో బిజీ అవ్వడం వల్ల ఈ కార్యక్రమానికి యాంకర్ గా దూరమయ్యారు.
అనసూయ దూరం కావడంతో కొన్నాళ్లపాటు రష్మీ యాంకర్ గా వ్యవహరించిన ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కొత్త యాంకర్ వచ్చినట్టు తెలుస్తుంది. తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా కొత్త యాంకర్ సౌమ్యరావు యాంకర్ పరిచయమయ్యారు. చూడటానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ యాంకర్ జబర్దస్త్ కార్యక్రమానికి సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఇలా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వచ్చిన సౌమ్య ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…నటనపై ఆసక్తితో ఉన్నటువంటి ఈమె మొదటగా కన్నడ బుల్లితెర సీరియల్ లో నటించారు.ఇలా కనడ బుల్లితెరపై ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈమె అనంతరం తమిళ టీవీ సీరియల్స్ లో నటించారు.ఇకపోతే తెలుగు ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న శ్రీమంతుడు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఈ విధంగా ఈ టీవీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తాజాగా ఓ పండుగ సందర్భంగా ఈటీవీ నిర్వహించినటువంటి స్పెషల్ షోలో హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ తో కలిసి తనదైన శైలిలో వారిపై పంచ్ డైలాగులు వేయడంతో మల్లెమాల వారి దృష్టి ఈమెపై పడింది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి సౌమ్యరావు కరెక్ట్ గా సరిపోతుందని భావించిన మల్లెమాలవారు తనని జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా నియమించినట్టు తెలుస్తుంది.నటిగా గుర్తింపు పొందిన ఈమె యాంకర్ గా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…