Have sex.. but use protection, my mother said." Heroine's sensational comments
ప్రముఖ హిందీ టెలివిజన్ నటి, చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన రోష్ని వాలియా తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆమె తన వ్యక్తిగత జీవితం, తల్లి తోడ్పాటును ఓపెన్‌గా షేర్ చేస్తూ, సమాజంలో మన ఊహలకు భిన్నంగా ఉండే పెరగడం, కుటుంబ వాతావరణం గురించి సంచలన విషయాలు వెల్లడించింది.
రోష్ని మాట్లాడుతూ, తన తల్లి చేసిన త్యాగం వల్లే తాము ఈ స్థాయికి ఎదిగామని చెప్పింది. “తన జీవితాన్ని పక్కన పెట్టి, మా కోసం ఊరు వదిలి వచ్చిన అమ్మకే మా విజయానికి క్రెడిట్ అందాలి,” అని భావోద్వేగంగా చెప్పింది. తల్లి అండ ఉండకపోతే తాము ఏ స్థాయికి చేరేవారమో తెలియదని చెప్పింది. షూటింగ్ సెట్స్‌లో పెద్దల మధ్య ఎక్కువగా గడిపిన కారణంగా, చిన్న వయస్సులోనే జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నేర్చుకున్నామని పేర్కొంది. ఇండస్ట్రీలోని రాజకీయాలు, పోటీ పరిస్థితులపై త్వరగా అవగాహన వచ్చినట్టు వివరించింది.
అంతేకాదు, తన తల్లి మామూలు తల్లిలా కాకుండా ట్రెండీగా, ఓపెన్ మైండెడ్‌గా ఉంటుందని తెలిపింది. “మా అమ్మ ఎప్పుడూ మమ్మల్ని జీవితాన్ని ఆనందించమంటుంది. సెక్స్ గురించి మాట్లాడేటప్పుడు ‘చేయాలి కానీ ప్రొటెక్షన్ తప్పనిసరి’ అని పదేపదే చెప్తుంది. ఈ విషయం నా అక్కకు చెప్తే, ఇప్పుడు నాకు కూడా చెప్తుంది,” అని ఓపెన్‌గా చెప్పిన రోష్ని, సామాజికంగా ఇలాంటి విషయాలను కుటుంబాల్లో ఓపెన్‌గా మాట్లాడటాన్ని నెగెటివ్‌గా చూడకూడదని పరోక్షంగా సూచించింది.
ఇక మామూలుగా మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించని విషయం గురించి కూడా రోష్ని వ్యాఖ్యానించింది. “మేము ఇంట్లో బోరింగ్‌గా ఉన్నాం అంటే, అమ్మ – ‘ఈరోజు ఏంటి, తాగలేదా?’ అని సరదాగా అడుగుతుంది. బయటకు వెళ్లి పార్టీ చేయాలని, హ్యాపీగా జీవించమని ప్రోత్సహిస్తుంది,” అని చెప్పింది. ఈ మాటలు చాలామందికి షాక్ ఇచ్చినా, కొందరు మాత్రం ఆమె తల్లిని మోడ్రన్ పేరెంటింగ్‌కు ఉదాహరణగా భావిస్తున్నారు.
రోష్ని చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో విభిన్న ప్రతిస్పందనలకు కారణమయ్యాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే, మరికొందరు మాత్రం కుటుంబ వ్యవస్థల మీద ప్రభావం పడే విధంగా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. అయినప్పటికీ, వ్యక్తిగత విషయాలను నిస్సంకోచంగా పంచుకోవడంలో రోష్ని చూపిన ఓపెనెస్, యువతతో సూటిగా మాట్లాడే తల్లితండ్రుల అవసరాన్ని మరోసారి చర్చకు తెచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…