Movie News

Actress Sadha: ఎంత ప్రయత్నించినా కన్నీళ్లు ఆగడం లేదు… ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సదా!

Actress Sadha:జయం సినిమాలో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించి వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ ఒక డైలాగుతో ఎంతో ఫేమస్ అయ్యారు నటి సదా.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళంలో కూడా అవకాశాలను అందుకొని హీరోయిన్ గా ఎంతో బిజీ అయ్యారు. అయితే తాజాగా సదా సినిమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.

ఇలా సినిమాలకు దూరమైనటువంటి సదా ఫలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈమె ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు సదా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంది ఏం జరిగింది అనే విషయానికి వస్తే..
సదా ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు ఒక రెస్టారెంట్ కూడా రన్ చేస్తున్నారు.

ముంబైలో ఈమె ఎర్త్ లింగ్స్ కేఫే పేరిటరెస్టారెంట్ నడుపుతుంది అయితే ఈ రెస్టారెంట్ చూసుకోవడం కోసం ఈమె తన పనులన్నింటినీ పక్కనపెట్టి ఈ రెస్టారెంట్ ను ఎంతో అందంగా తీర్చిదిద్ది నడుపుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈ ప్లేస్ ఓనర్ తనని కాళీ చేయమని చెప్పారంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.

2019 ఏప్రిల్ 23వ తేదీ ఈ రెస్టారెంట్ ప్రారంభించాను అని తెలిపారు. అయితే రెస్టారెంట్ ప్రారంభించడానికి ముందు ఇక్కడ అంతా చాలా చండాలంగా ఉండేది అయితే కరోనా సమయంలో తన రెస్టారెంట్ కు కస్టమర్లు రాకపోయినా అధిక సమయం ఇక్కడే ఉంటూ తన రెస్టారెంట్ ను చాలా అందంగా తీర్చిదిద్దుకున్నానని సదా తెలిపారు.

Actress Sadha: కన్నీళ్లు ఆగలేదు….

కరోనా సమయంలో తన రెస్టారెంట్ నడవకపోయినా సరైన సమయానికి అద్దె చెల్లించినప్పటికీ ఓనర్ మాత్రం ఖాళీ చేయమని తనకు నెలరోజులపాటు గడువు ఇచ్చారని తెలిపారు. ఇది నాకు పెద్ద షాకింగ్ విషయమే అని చెప్పాలి.అయితే ఈ రెస్టారెంట్ వదిలి వెళ్లిపోవడం తన వల్ల కాలేదని కన్నీళ్లు కూడా ఆగడం లేదు అంటూ ఈ సందర్భంగా సదా కన్నీటి పర్యంతరం అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago