Movie News

Samantha: సమంతతో విడాకులపై మొదటిసారిగా స్పందించిన నాగచైతన్య…. ఏమన్నారంటే?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు పొందిన సమంత, నాగచైతన్య విడిపోయి ఇప్పటికీ రెండు ఏళ్ళు అవుతుంది. ప్రేమించి వివాహం చేసుకున్న వీరిద్దరూ మూడు సంవత్సరాలు కూడా కలిసి జీవించలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఒకరికొకరు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు వీరి విడాకులకు గల కారణాల గురించి పూర్తి సమాచారం తెలియలేదు.

సమంత, నాగచైతన్య కూడా వారి విడాకులకు సంబంధించిన విషయాల గురించి ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా నాగచైతన్య మొదటిసారిగా సమంతతో విడాకుల గురించి స్పందించాడు. ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విడాకులకు గల కారణాల గురించి చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ..” మేము అధికారికంగా విడిపోయి రెండేళ్లు అవుతోంది. నిజానికి సమంత చాలా మంచి అమ్మాయి. ఆమెతో విడిపోయినా కూడా ఆ జ్ఞాపకాలను నేను ఇప్పటికీ గౌరవిస్తాను. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి.మొదట్లో రూమర్స్ ని ఎక్కువగా పట్టించుకునే వాడిని కాదు.

Samantha: రూమర్సే విడాకులకు కారణం

కానీ రాను రాను ఆ రూమర్స్ ఎఫెక్ట్ మా మధ్య మనస్పర్ధలు పెరిగేలా చేశాయి. మేము విడిపోయిన కూడా ఇప్పటికీ ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది. కానీ మీడియా, సోషల్ వెబ్సైట్స్ ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ఇష్టం వచ్చినట్టుగా కథనాలు సృష్టిస్తున్నారు. ఇవి మనసుని చాలా బాధపడతాయి. అంతేకాకుండా గతంలో నాకు ఎటువంటి సంబంధం లేని మూడో వ్యక్తిని నా జీవితంలోకి లాక్కొచ్చి వారిని అగౌరవపరిచినట్టు చెత్తగా వార్తలు రాస్తున్నారు. అయితే ఏం జరిగినా అంతా నా మంచికే అనుకుంటాను. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నా అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago