Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల ఏప్రిల్ 28న సమంత తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ ఏడాది ఈ అమ్మడు 36వ పుట్టినరోజుని స్నేహితుల మధ్య ఘనంగా జరుపుకుంది. తాజాగా తన బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది.
ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సమంత బర్త్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, సౌత్ స్టార్స్ అంతా కూడా బెస్ట్ విషెస్ తెలియజేశారు. తాజాగా తన బర్త్ డే వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకున్న సమంత ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ” పుట్టిన రోజున సింపుల్ రూల్స్.. సర్ ప్రైజ్‌లు కాదు, కేక్‌లు కాదు.. బెలూన్‌లు కూడా కాదు.. నేను కోరుకున్నది నాకు స్పష్టంగా లభించింది.’ అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది.
సమంత ఇలాంటి క్యాప్షన్ ఎందుకు పెట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయింది. సమంత కెరీర్లోనే శాకుంతలం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది. ఇటీవల ‘సిటాడెల్’ ప్రమోషన్స్ లో కూడా సమంత సందడి చేసింది.
ఇక తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తూ బిజీగా ఉంది. ఇంతకాలం సమంత అనారోగ్యం వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మళ్లీ పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 1 వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాతో అయినా సమంత, విజయ్ దేవరకొండకి హిట్ పడుతుందో? లేదో? చూడాలి మరి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…