“సమీరా రెడ్డి” ముంబై లో సెటిల్ అయిన తెలుగు హీరోయిన్… దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించిన “నరసింహుడు” అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పైరిచయమైంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ కథానాయకుడు… ఈ సినిమా వచ్చిన అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన “జై చిరంజీవ” సినిమాలో కథానాయికగా నటించింది. తెలుగులో ఆమె నటించిన మొదటి సినిమా “నరసింహా” ఆశించిన రీతిలో ఆడకపోయినా… ఎన్టీఆర్ తదుపరి చిత్రం అశోక్ లో హీరోయిన్ గా అవకాశం లభించింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు.
అయితే ఈ చిత్రం సమయంలోనే ఎన్టీఆర్, సమీరా రెడ్డి ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లికూడా చేసుకుంటారని ఫిలింనగర్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈ రూమర్స్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ… ఆ తరువాత సమీరా రెడ్డి ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమెకు వచ్చిన తెలుగు సినిమా ఆఫర్లను తిరస్కరించిందట. అయితే ఆ రూమర్స్ తమ ఫ్యామిలీని, తనను తీవ్రంగా బాధించాయని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సమీరా రెడ్డి.
అయితే ఎన్టీఆర్ తో ఆ సమయంలో చాలా చనువుగా ఉండేదాన్ని, ఈ క్రమంలో మేమిద్దరం రిలేషన్షిప్ లో వున్నామనే రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ఫ్యాన్స్ అందరు నన్ను ఎన్టీఆర్ హీరోయిన్ గా ప్రచారం చేసారు.. ఒకానొక సమయంలో నాపేరు కూడా సమీరా ఎన్టీఆర్ గా మార్చేశారు. నేను మంచి నటి, డాన్స్ కూడా చాలా బాగా చేస్తాను. అంత టాలెంట్ ఉండి కూడా కేవలం ఎన్టీఆర్ హీరోయిన్ అని పిలిపించుకోవడం నాకు నచ్చలేదు. అదే సమయంలో ఆ రూమర్లు నన్ను చాలా బాధించాయి. ఎన్టీఆర్ ను కూడా బాధపెట్టి ఉండొచ్చు అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అయితే సమీరా 2014లోనే ఒక పారిశ్రామిక వేత్తను పెళ్లాడింది. పెళ్లి తరువాత సినిమాలవైపు చూడాలే సమీరా రెడ్డి. ఇద్దరు పిల్లలతో సమీరా అక్షయ్ వార్డె ల సంసారం హాపీగా సాగుతోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…