మన దేశంలో కరోనా నానాటికీ పెరుగుతూనే ఉంది.. కోవిడ్-19 ప్రభావాన్ని సకాలంలో గుర్తించి లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి కాస్త మెరుగ్గానే అనిపిస్తుంది. అయితే దేశవ్యాప్తంగా సగటున లక్ష మందికి 254 కరోనా టెస్టులు మాత్రమే చేస్తుండటం కాస్త ఆందోళన కలిగిస్తున్న విషయం. కరోనా టెస్టులు చేయడం ఇంకాస్త స్పీడు పెంచితే పాజిటివ్ కేసులు సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. అయితే దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కాస్త తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే పరిణామం.
కాగా సోమవారం (20 ఏప్రిల్) ఉదయానికి కరోనా సోకిన వారి సంఖ్య దేశవ్యాప్తంగా 17 వేలు దాటింది. దేశంలో మొత్తం మీద 17,265 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అందులో 543 మంది ఇప్పటివరకు మృతి చెందగా.. మరో 2546 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య మాత్రం 14,175 గా నమోదయింది.
రాష్ట్రాలవారీగా చుస్తే… అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ 2003 కేసులు, గుజరాత్ 1743 కేసులు, రాజస్థాన్ 1478 కేసులు, తమిళనాడు 1477 కేసులు, మధ్యప్రదేశ్ 1084 కేసులు, తెలంగాణాలో 844 కేసులు, ఆంద్రప్రదేశ్ లో 646 కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…