Categories: FeaturedMovie News

అనుష్క వల్ల తీవ్ర ఇబ్బందుల్లో “నిశ్శబ్దం” నిర్మాతలు..!! అసహనంతో…!

“భాగమతి” సినిమా తరువాత అనుష్క చేస్తున్న చిత్రం “నిశ్శబ్దం”. ఈ చిత్రంపై భారీ అంచానాలే ఉన్నాయి. ఇటీవలే ఫస్ట్ లుక్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది.. తెలుగులో “నిశ్సబ్దం” పేరుతో.. మిగిలిన భాషల్లో “సైలెన్స్” పేరుతో రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే ఒక మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోంది. తమిళ నటుడు మాధవన్ ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నాడు. మరియు షాలినీ పాండే, అంజలి, అవసరాల శ్రీనివాస్ లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మొత్తం అమెరికాలో చిత్రీకరించడంతో అంచనాలు ఓ భారీగా ఉన్నాయి.

అన్ని బాగుండి.. మనకు కరోనా గొడవలేకుంటే.. ఈ పాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి హడావిడి చేసేది. లాక్ డౌన్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అందరిని వేదించే ప్రశ్న ఒక్కటే.. ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేసినా సినిమాలకు ఇదివరకటిలా జనాలు ఎంతవరకు వస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఓటిటీ ప్లాట్ ఫామ్ కు అమ్మెందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం “నిశ్శబ్దం” సినిమాకు ఉన్న క్రేజీ దృష్టిలో పెట్టుకుని అమెజాన్ ప్రైమ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందట.

ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా అనుకున్న సమయానికి విడుదలకు నోచుకోకపోవడంతో నెలకు లక్షల్లో వడ్డీలు కట్టుకుంటున్న నిర్మాతలు. ఈ కారణంతో అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ఆఫర్ వైపు నిర్మాతలు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కు అమ్మాలంటే అనుష్క ఒప్పుకోవాల్సిందేనట. అయితే ఆమె మాత్రం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు అంగీకరించడం లేదని సమాచారం. దానితో వడ్డీలు కట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నిర్మాతలు అనుష్క తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారట.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago