Actress Sanghavi: సింధూరం సినిమాలో హీరోయిన్ గా నటించి సందడి చేసిన నటి సంఘవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అమాయకత్వంతో అందరిని ఎంతగానో ఆలరించిన సంఘవి వివిధ భాషలలో నటిస్తూ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.దాదాపు తన 15 సంవత్సరాల సినీ కెరియర్లో అన్ని భాషలలో కలిపి 80 సినిమాలకు పైగా నటించి సందడి చేశారు.
తెలుగులో కూడా ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు ఈ కన్నడ సోయగం.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి సంఘవి 38 సంవత్సరాల వయసులో బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి వెంకటేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక ఈమెకు 42 సంవత్సరాల వయసులో ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఇలా తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నటువంటి సంఘవి అందరి హీరోయిన్స్ మాదిరిగానే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలలో కాకుండా జబర్దస్త్ వంటి కార్యక్రమంలోనూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ వచ్చారు.అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ సంఘవి పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సంఘవి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…