Featured

Senior Journalist Bhardwaja : డైరెక్టర్ సాగర్ కి చిరంజీవి కి మధ్య గొడవ ఏమిటి… ఆయనతో ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేదంటే…: సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : సీనియర్ దర్శకులు విద్యా సాగర్ రెడ్డి అందరికీ డైరెక్టర్ సాగర్ గా బాగా సుపరిచితులు. మొదట ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ లో పనిచేసి ఆ తరువాత దర్శకత్వంలోకి వచ్చిన ఈయన కృష్ణ గారితో మొదట సినిమా తీయాలని అనుకునేవారట. దాదాపు పది సంవత్సరాలపైనే సహాయ దర్శకుడిగానే పనిచేసారు. దర్శకుడిగా మంచి హిట్లందుకున్న ఈయన నిర్మాతగా సినిమా తీసి భారీ నష్టాలను చూసారు. ఇక సినిమాలను తీయకూడదని నిర్ణయించుకుని అస్త్ర సన్యాసం చేసారు. ఇటీవలే అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు సాగర్ గారు. ఇక ఆయన సినిమా జీవిత విశేషాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ అందించారు.

చిరంజీవితో సినిమా అందుకే చేయలేదు…

సాగర్ గారు మొదటి సినిమానే ‘రాకాసి లోయ’ అనే యాక్షన్ సబ్జెక్టు ఎంచుకుని హిట్ కొట్టారు. ఆ సినిమా తరువాత మళ్ళీ అదే తరహా యాక్షన్ సబ్జెక్టులను తీయకూడదనే ఉద్దేశంతో డిఫరెంట్ జోనర్స్ ట్రై చేశారు సాగర్. అలా కృష్ణ గారితో అమ్మదొంగ, భరత సింహం వంటి సినిమాలను తీసిన ఆయన భానుచంధర్ తో తీసిన ‘స్టూవర్టుపురం దొంగలు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

అయితే ఆ సినిమా సమయంలో ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ అనే టైటిల్ తో చిరంజీవి హీరోగా సినిమా విడుదల అవడం, ఆ సినిమా ఫ్లాప్ అలానే సాగర్ గారి సినిమా హిట్ అవడంతో ఒకరకమైన క్లాష్ చిరంజీవి గారికి అలానే సాగర్ కి వచ్చిందని భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. వరుసగా హిట్లందుకుంటున్న సాగర్ తో సినిమా చేయాలని అందరు పెద్ధ హీరోలు ఆఫర్ ఇవ్వగా చిరంజీవి మాత్రం ఆ దిశగా ప్రయత్నించలేదట. బహుశా స్టూవర్టుపురం దొంగలు పోలీసులను తరిమినందుకు అయ్యుండవచ్చు అని అదీకాక సాగర్ చాలా బోల్డ్ గా మాట్లాడే మనిషి అవడం వల్ల సినిమా ప్రమోషన్స్ అపుడు మాట్లాడిన విషయాలు కూడా చిరంజీవికి నచ్చక సాగర్ కి దూరంగానే ఉండిఉండవచ్చు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago