Featured

Producer Chittibabu : తారకరత్న హాస్పిటల్ బిల్లు ఎంతైందో, ఎవరు బిల్స్ కడుతున్నారో క్లారిటీ ఇచ్చిన నిర్మాత చిట్టిబాబు…!

Producer Chittibabu : నందమూరి తారక రత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ సభకు హాజరై అక్కడ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకి తరలిండం చకచకా జరిగిపోయాయి. తారక రత్నకు గుండెనొప్పి రావడంతో తనని చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించడానికి వస్తున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు చెబుతున్నా ఇంకా పరిస్థితి క్రిటికల్ గా ఉందంటూ తెలుస్తోంది. అయితే ఆయన్ను విదేశాలకు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక పూటకో న్యూస్ తో అసలు తారకరత్న విషయంలో ఏం జరుగుతోంది అనే క్లారిటీ ఇవ్వడానికి నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.

బిల్స్ ఎవరు కడుతున్నారంటే…

చిట్టిబాబు మాట్లాడుతూ తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారంటూ చెప్పారు. నారాయణ హృదయాలయలో తనకు మెరుగైన వైద్యం అందుతోందని, ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ తో ట్రీట్మెంట్ జరుగుతోందని చెప్పారు. తారక రత్న ఆరోగ్యం గురించి బయటికి వినిపిస్తున్న వార్తలు వదంతులు అంటూ తెలిపారు. తనని విదేశాలకు తీసుకెళ్తున్నట్లు బ్రెయిన్ డామేజ్ అయిందంటూ చెప్తున్న మాటలు వాస్తవం కాదని వివరించారు చిట్టిబాబు. బాలకృష్ణ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు చెప్పారు. వైద్యనికి తారకరత్న స్పందిస్తున్నా ఇంకా ప్రమాదం అయితే ఉందని కాకపోతే కళ్ళు తెరిచి చూస్తున్నాడు ప్రోగ్రెస్ ఉందంటూ తెలిపారు. ఇక వైసీపీ వాళ్ళు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నారని, అయినా ఇటువంటి విషయాలలో రాజకీయాలు చేయడం ఏమిటి అంటూ విమర్శించారు.

తారకరత్న కుటుంబంలో అందరితోనూ చాలా బాగా కలిసి మెలిసి ఉండేవాడు అందువల్ల ఇప్పుడు కుటుంబం మొత్తం అతనికోసం చూస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాస్పిటల్ ఖర్చు వాళ్ళు కడుతున్నారు వీళ్ళు కడుతున్నారు అంటూ పూటకో న్యూస్ వస్తోంది. అసలు వాళ్ళ కుటుంబ విషయం అది, అతను కోలుకోవాలని కోరుకుంటున్నారు అందరూ. ఇక బిల్స్ బాలకృష్ణ కడుతున్నాడు, చంద్రబాబు కడుతున్నాడు అంటూ వార్తలు ఎందుకు, వాళ్లంతా ఒక కుటుంబం. తారక రత్న తండ్రి మోహన్ కృష్ణ కు డబ్బు లేదా అయితే అందరూ బాధ్యత తీసుకున్నారు, అంత మాత్రాన వాళ్ళు బిల్స్ కడుతున్నారు వీళ్ళు కడుతున్నారు అంటూ న్యూసెన్స్ ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago