Actress Shanoor Sana Begum : దుబాయ్ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు…: నటి షానూర్ సన బేగం

0
960

Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే సీరియల్స్ లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన బేగం. మోడల్ గా అడుగుపెట్టిన ఆమె నిన్నేపెళ్లాడతా సినిమాలో బెనర్జీ వైఫ్ గా క్యారెక్టర్ చేసి తెలుగులో మంచి గుర్తింపు అందుకున్నారు. ఇక చక్రవాకం సీరియల్ ద్వారా మరింత పాపులర్ అయిన సన అటు సీరియల్స్ ఇటు సినిమాలు చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని తన లైఫ్ ని వ్లాగ్స్ చేస్తూ అలరిస్తోంది. రీసెంట్ గా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ అన్ని విశేషాలను పంచుకున్నారు.

దుబాయ్ లో బాగా టార్చర్ చేసారు…

సన బేగం ఇంటర్ చదివే సమయంలోనే పెళ్లి చేసేసుకున్నారు. తండ్రికి వ్యాపారంలో లాస్ రావడంతో సన కు త్వరగా పెళ్లి చేసేశారట. ఇక అత్తింటి వారి ప్రోత్సాహంతోనే బిఎడ్ వరకు చదివిన సన తొలత స్కూల్ పెట్టాలని అనుకున్నా చివరకు మోడలింగ్ వైపు అడుగులేసారు. ఇంట్లో అత్త మామల సపోర్ట్ తోనే యాడ్స్ చేస్తూ ఉన్న సన కు నిన్నేపెళ్ళాడతా సినిమా అవకాశం రావడంతో ఒక్కసారిగా లైఫ్ మారిపోయింది అంటూ చెబుతారు. ఇక ఇద్దరు పిల్లలు పుట్టాక సినిమాల్లోకి వచ్చిన సన తన పిల్లలని మాత్రం సినిమా ఫీల్డ్ లోకి తీసుకు రాలేదు. అమ్మాయికి పెద్దగా ఇష్టం లేకపోవడం వల్ల మొదట్లో మంచి అవకాశాలు వచ్చినా సినిమాలోకి వద్ధన్నుకున్నారట.

ఇక కూతురు చదువయ్యాక పెళ్లి చేసి అత్తారింటికి పంపగా వాళ్ళు బాగా మోసం చేసారని తెలంగాణ పోలీసులు ఈ విషయంలో బాగా సహాయం చేసారంటూ తెలిపారు. దుబాయ్ లో ఇల్లు ఉంది అని చెప్పి అక్కడ బాగా చిత్ర హింసలు పెట్టారు. అక్కడ ఒకచోట అని చెప్పి వేరే చోట తనని ఉంచారు. ఇవన్నీ కూతురు చెప్పకపోయినా తెలుసుకున్నామని విషయాలు తెలిసాక తనని తీసుకోచ్చి పోలీసుల సహాయంతో వారిని అరెస్ట్ చేయించాం అంటూ చెప్పారు. కొడుకు, నా భర్త, నేను నా కూతురుకి అండగా నిలబడ్డాము. తను ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోస్ చేస్తోంది. తనకు ఐదేళ్ళ చిన్నారి కూడా ఉంది అంటూ తెలిపారు.