Actress Shanoor Sana Begum : నా కోడలు సమీర విషయంలో పొరపాటు చేశాను… లవ్ ఎఫైర్ ఏంటంటే…: నటి షానూర్ సన బేగం

0
637

Actress Shanoor Sana Begum : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల్లో సినిమాలు చేసిన సన బేగం, అటు సీరియల్స్ ఇటు సినిమాలు రెండింటినీ చేస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉంటున్నారు. నిన్నేపెళ్లాడతా సినిమాతో తెలుగులో తన సినిమా ప్రయాణం మొదలు పెట్టిన సన గారు ఆపైన ఎన్నో సినిమాల్లో తల్లి, అక్క, వదిన, అత్త అంటూ రకరకాల పాత్రలను చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు భాషల్లో నటిస్తూ ఉన్న సన గారు తాజాగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిమానులకు మరింత చేరువయ్యారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు కొడలి గురించి మాట్లాడుతూ కోడలు సమీర గురించి హాట్ కామెంట్స్ చేసారు.

సమీర విషయంలో పొరపాటు చేశాను…

సన గారి అబ్బాయి అన్వర్ సినిమాల్లోకి నటించకపోయినా సన గారి యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం. ఇక కొడుకు అన్వర్ భార్య ప్రముఖ బుల్లితెర యాంకర్ సమీర. వాళ్లది ప్రేమ వివాహం. అయితే వాళ్లకు ఎలా పరిచయం, వాళ్ళ ప్రేమ కథ ఏమిటి అనే విషయాలను సన గారు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సన గారు సమీర ఇద్దరూ ఒక సీరియల్ లో కలిసి నటిస్తున్న సమయంలో ఫేస్ బుక్ లో సన గారి అబ్బాయి పుట్టినరోజు అని చూసి సమీర నా తరుపున విష్ చేయండి అని సన గారికి చెప్పిందట.

నేను చెప్పడమేమిటి నువ్వే చెప్పు అని సమీర కు కొడుకు అన్వర్ ఫోన్ నెంబర్ ఇచ్చి పరిచయం చేశారట సన. అంతే ఆ తరువాత వాళ్ళు కలవడం మాట్లాడటం ప్రేమలో పడటం అన్నీ జరిగిపోయాయట. మొదట్లోనే విషయం సన గారికి ఇద్దరూ చెప్పేశారట. అయితే సన మాత్రం టైం తీసుకుని బాగా ఆలోచించాకే పెళ్లి చేసుకోండని చెప్పారట. అలా నా కొడుకు నెంబర్ నేనే ఇచ్చి పొరపాటు చేసానంటూ వాళ్ళ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నారు సన.