Categories: Featured

Actress Side Business : సినిమాల్లోనే కాదు వ్యాపారాల్లోనూ తగ్గేదెలా అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్ !

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. దానికి కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు.. మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లు…

ఒకవైపు చేతి నిండా సినిమాలతో కోట్ల రూపాయలు సంపాదిస్తూనే మరోవైపు బిజినెస్ లో కూడా రాణిస్తూ అక్కడ కూడా సక్సెస్ అయ్యారు.. అయితే ఆ హీరోయిన్లు ఎవరు.. వాళ్లకు ఎలాంటి బిజినెస్లు ఉన్నాయి… ఇలాంటి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం..

1. తాప్సీ
ఒక వైపు సినిమాలు చేస్తూనే బిజినెస్లో బాగా రాణిస్తున్న హీరోయిన్లలో మొదటగా మనం తాప్సి గురించి మాట్లాడుకోవాలి. 1987 ఆగస్టు 1న జన్మించిన తాప్సీ.. చిన్న వయసులోనే మోడలింగ్లోకి అడుగుపెట్టింది.. మన తెలుగు సినిమా లెజెండరి డైరెక్టర్స్ లో ఒకరైన రాఘవేంద్ర రావు గారు ఒక మోడలింగ్ షోలో తాప్సీని చూసి మంచు మనోజ్ హీరోగా ఆయన తీస్తున్న ఝుమ్మందినాదం అనే సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. అలా తెలుగులో మొట్టమొదటి సారి ఝుమ్మందినాదం అనే సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టిన తాప్సీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వరుసగా తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని తాప్సీ సద్వినియోగం చేసుకొని తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసింది. అందుకే ఆమెకి రెండు ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చాయి.

అలా హీరోయిన్ గా బాగా రాణిస్తున్న టైంలోనే బిజినెస్ లో కూడా అడుగు పెట్టింది. ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే సంస్థని తన సిస్టర్ షాగన్ మరియు స్నేహితుడు ఫరాహ్హ్ తో కలిసి స్థాపించి ఇండియాలో ఉన్న VIP ల పెళ్లిళ్లన్ని చేస్తుంది..ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సంస్థతో అనుసంధానమై పెళ్లి చేసుకున్నారు..ఇక ఇప్పుడు మొత్తానికి బాలీవుడ్ లో సెట్టిల్ అయినా ఈ భామ అటు సినిమాలు చేస్తూనే.. ఇటువైపు బిజినెస్ లో కూడా రానిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.

2. నయనతార
మన సౌత్ ఇండియన్ కుర్రాళ్ళు అందరూ ఇష్టపడే హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది నయనతార మాత్రమే.. అందుకే మనమంతా నయనతారని లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటాం. 1984 నవంబర్ 14 న జన్మించిన నయనతార 2003లో మలయాళం సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడినుంచి తమిళం తెలుగు కన్నడ సినిమాల్లో అందరి స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా నటిస్తూ కుర్రకారు మనసు దోచేసింది. ఇప్పుడు నయనతారకి 37 సంవత్సరాలు.. ఆమె హీరోయిన్గా తన కెరీర్ మొదలుపెట్టి దాదాపుగా 20 సంవత్సరాలు కావస్తోంది… అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ చేతినిండా సంపాదిస్తోంది ఈ లేడీ సూపర్ స్టార్… ఈమెకి కూడా చాలా బిజినెస్ లు ఉన్నాయి.

The Lip Balm అనే కాస్మొటిక్ కంపెనీ ఆమెకి మంచి లాభాలను తెచ్చి పెడుతోంది. అంతేకాదు రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలను నిర్మిస్తోంది. అలాగే చాయ్ వాలే అంటూ ఫుడ్ ఆన్ బేవరేజ్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి అందులోనూ లాభాలను గడిస్తు రెండు చేతులా సంపాదిస్తుంది..

శ్రీయ శరన్
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక తరం కుర్రకారు యొక్క కలల రాకుమారి ఎవరంటే అది శ్రీయనే… ఒక పది సంవత్సరాల పాటు తెలుగు సినిమా పరిశ్రమని ఏలిన హీరోయిన్ కూడా శ్రీయనే… 1982 సెప్టెంబర్ 11న జన్మించిన శ్రీయ.. వాళ్ళ డాన్స్ టీచర్ వలన హీరోయిన్ అయిపోయింది. ఆమెను మొదటిసారి రామోజీ రావు గారు 2001లో వచ్చిన ఇష్టం అనే సినిమా ద్వారా తెలుగులో కి పరిచయం చేశారు.

ఇక అక్కడి నుంచి ఇప్పుడొచ్చే ఆర్ ఆర్ ఆర్ సినిమా లో కూడా శ్రియ నటిస్తోంది. అంటే దాదాపు 21 సంవత్సరాలు..మరి ఇంత ఎక్స్పీరియన్స్ శ్రేయ కి బిజినెస్ లు లేకుండా ఉంటాయా.. ఈమె లిస్టులో కూడా ఎన్నో బిజినెస్ ఉన్నాయి.. అందులో ఒకటే శ్రీ స్పందన స్పా కంపెనీ.. ఇండియాలో ఉన్న స్పా బిజినెస్ లో ఈ కంపెనీ చాలా స్పెషల్.

రకుల్ ప్రీత్ సింగ్
ఈ తరం కుర్ర కారుకి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు… ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సూపర్ హిట్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ ఏంత ఫిట్ గా ఉంటారో… ఆమె ఫిట్నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనం ఆమె జిమ్ చేస్తున్న వీడియో లు చూస్తే మనకు అర్థమైపోతుంది.

అందుకే F45 – ఫిట్నెస్ హెల్త్ హబ్ లో ఫ్రాంచైజ్ తీస్కొని ఇండియాలో ఉన్న అన్నీ మెట్రో సిటీస్ లో జిమ్ లను ఓపెన్ చేసింది. ఈ జిమ్ లకు ఇండియాలో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీలు వస్తుంటారు..రష్మిక, రవితేజ, మంచు లక్ష్మి ఇలా చాలామంది మన తెలుగు సెలబ్రిటీస్ ఈ జిమ్ లోనే వర్కౌట్స్ చేస్తుంటారు. ఇలా అటు సినిమాలు చేస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తూ బాగా సంపాదిస్తోంది.

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. ఈమె ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా స్టార్ హీరోలందరితో పని చేసింది అలాగే తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో నటించింది. 2007 లో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా పరిచయం చేశారు డైరెక్టర్ తేజ గారు.. ఇక అక్కడ నుండి ఇప్పటి వరకు కాజల్ తిరిగి చూసుకోలేదు.

తన ఇన్నేళ్ల కెరియర్ మొత్తం… మూడు పువ్వులు ఆరు కాయలు లాగా నడిచింది.. అందుకే ఈ భామ బిజినెస్ లో కూడా చాలా డబ్బులని ఇన్వెస్ట్ చేసింది. మరీ ముఖ్యంగా Marsala అనే జ్యువెలరీ కంపెనీని తన చెల్లెలు తో కలిసి లాంచ్ చేసింది. ఇప్పుడు హాయిగా లవ్ మ్యారేజ్ చేసుకొని కూల్ గా కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…

50 minutes ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

1 hour ago

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

12 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

12 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

12 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

12 hours ago