Featured

Samantha : షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు సమంతా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా?

వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంతా.. వీలు దొరికినప్పుడల్లా ఆయా వస్త్రదుకాణాల ప్రారంభోత్సవానికి వెళ్తుంది. పలు రకాల వ్యాపారాల్లోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది. తన సినిమాలతో పాటు.. ఇతర విషయాలను కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు షేర్ చేస్తుంది. తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తుంది. అంతేకాకుండా తన పోస్టులు కూడా చాలా పాజిటివ్ గా ఉంటాయి.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈ హీరోయిన్ బాగా బిజీ అయ్యింది. వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా ఆమె నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఆ పోస్టర్ కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నల్లగొండలో ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించింది. ఈ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కు తను చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం సమంత 15 నుంచి 20 లక్షలు తీసుకుందట. వాస్తవానికి స్టార్ హీరోయిన్లు ఇలాంటి వేడుకలకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. కానీ సమంత ఎందుకో చాలా తక్కువ డబ్బులు తీసుకుందట.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ యశోద అనే సినిమా చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఇందులో సమంతా జర్నలిస్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. అటు శాకుంతలం సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుటుంది. మొత్తంగా విడాకుల అనంతరం వరుస సినిమాలు చేస్తూ ముందుగు సాగుతుంది ఈ కేరళ అమ్మాయి. అటు ముంబైతో పాటు ఇటు హైదరాబాద్ లోనూ ఉంటూ అక్కడ, ఇక్కడ సినిమాలు చేస్తుంది. సమయం దొరికినప్పుడల్లా మానసిక ప్రశాంతత కోసం టూర్లకు కూడా వెళ్తోంది. మిత్రులతో ఎంజాయ్ చేస్తోంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

12 minutes ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

21 minutes ago

బాలకృష్ణతో మళ్లీ సినిమాలు ఎందుకు చేయలేదు? విజయశాంతి షాకింగ్ రివీల్!

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

25 minutes ago

ఆయన లేకుంటే ఆర్జీవీ ఇలా ఉండేవాడు కాదు.. జీవితాన్ని మలిచిన వ్యక్తి ఎవరంటే?

తెలుగు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం…

1 hour ago

సినిమాల కోసం ఆస్తులు అమ్మేసిన నటుడు..కళ్ళు చిదంబరం జీవితం వెనుక నిజాలు

తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…

2 hours ago

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

13 hours ago