Categories: FeaturedMovie News

Actress Srilakshmi : ఆ రోజుల్లో.. చిరంజీవిని చెప్పు కుట్టించుకురమ్మన్నాను.. ఇక అంతే ఆయన ఫ్యాన్స్ ఏం చేశారంటే.. : శ్రీలక్ష్మి

Actress Srilakshmi : ఒకప్పటి సినీ నటుడు, శ్రీ లక్ష్మీ తండ్రి అమర్‌నాథ్ చిన్నతనంలోనే చనిపోవడంతో, శ్రీలక్ష్మి ఫ్యామిలీ కొన్ని కష్టాలు ఎదుర్కొంది. దాంతో ఆవిడ సినిమాల్లోకి రావాల్సివచ్చింది. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో శుభోదయం సినిమా, బాపు దర్శకత్వంలో వంశవృక్షం సినిమాలలో కథానాయిక అవకాశం వచ్చిందికానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాల్లో చేయలేకపోయింది. అక్కినేని నటించిన గోపాలకృష్ణుడు సినిమాలోని ఒక పాటలో అక్కినేని పల్లవికో అమ్మాయితో కనిపిస్తాడు. అమరనాథ్‌గారి అమ్మాయినే పెట్టండి. వాళ్ల కుటుంబానికి సాయం చేసినవారం అవుతాం అని అక్కినేని చెప్పడంతో ఒక అమ్మాయికోసం శ్రీలక్ష్మిని తీపుకున్నారు.

అక్కినేని పక్కన పంజాబీ డ్రస్ వేసుకొని శ్రీలక్ష్మి డాన్స్ చేసింది. అయినా అవకాశాలు రాలేదు. కె.బాపయ్య దర్శకత్వంలో వచ్చిన నివురుగప్పిన నిప్పులో మొదటిసారి కమెడియన్ గా (నగేష్ పక్కన) చేశారు. సినిమా విజయం సాధించలేదుకానీ, శ్రీలక్ష్మి పాత్ర సూపర్‌ హిట్టయ్యింది. తర్వాత జంధ్యాల గారి రెండుజెళ్ళ సీతలో చిన్న అవకాశం దొరికింది. ఒక్క సీన్ చేయగానే, డైరెక్టర్ శ్రీలక్ష్మిగారి టాలెంట్‌ని గుర్తించి, క్యారెక్టర్ని పొడిగించారు. ఆతర్వాత జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించారు. అయితే ఆ పాత్రతో ఆమె హాస్యనటిగా స్థిరపడడంతో వరసగా 13 ఏళ్ళపాటు అదే పురస్కారం పొందారు..

1985, అల్లు అరవింద్ నిర్మాణం, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజేత చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, భానుప్రియ హీరో హీరోయిన్లుగా నటించారు. మధ్యతరగతి కుటుంబాన్ని నడుపుతున్న ఓ తండ్రి కుమారుల్లో చివరివాడు చిరంజీవి. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి పేదరికం అడ్డుగా వస్తుంది. ఆ క్రమంలో ఫుట్ బాల్ ప్లేయర్ అయిన చిన్న కుమారుడు తన కిడ్నీ అమ్మి చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ అంశం.. అయితే ఈ సినిమాలో చిరంజీవికి వదినగా నటించినా శ్రీలక్ష్మి సినిమాలో ఓ సన్నివేశంలో.. తెగిన చెప్పును చిరంజీవిచే కుట్టించుకు రమ్మంటుంది…

ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్న శ్రీలక్ష్మి చిరంజీవిచే ఆ రోజుల్లో అలా చేయించడం ద్వారా అతని ఫాన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. మా హీరోతో అలా చేయిస్తావా అంటూ చిరంజీవి ఫ్యాన్స్ అడిగారన్నారు. కానీ చిరంజీవి షూటింగ్ సమయంలో చాలా సరదాగా ఉండేవారని అప్పట్లో క్యారవాన్స్ లేవని ఆర్టిస్టులందరూ ఒకే కుటుంబం లాగా ఒకే దగ్గర కూర్చొని కుశల ప్రశ్నలు వేసుకునే వారమని ఇప్పుడు క్యారవాన్స్ ఉండడం మూలంగా షూటింగ్ గ్యాప్ లో ఎవరికి వారు క్యారవాన్స్ కి వెళ్లి ఉంటున్నారని అప్పటి రోజులు తిరిగి రావని.. ఓ ఇంటర్వ్యూలో కమెడియన్ ఆర్టిస్టు శ్రీలక్ష్మి గుర్తు చేసుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago