Jeevitha Rajasekhar: తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న జీవిత రాజశేఖర్ గురించి అందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ వారి కూతుర్లను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ఇలా వీరి వారసురాళ్లుగా శివాని శివాత్మిక ఇద్దరూ కూడా హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
తాజాగా శివాత్మిక పంచతంత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 9 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో జీవిత మాట్లాడుతూ …. నా పిల్లలు ఇద్దరు కూడా చిన్నప్పటినుంచి సినిమా వాతావరంలో పెరిగారు. వాళ్లు ఒకరోజు మేము కూడా ఇండస్ట్రీలోకి వస్తామని చెప్పడంతో కొంత టెన్షన్ పడ్డాము.
సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే చాలా కష్టం. మనం అనుకున్న పాత్రలు రావచ్చు రాకపోవచ్చు. చిన్నప్పటి నుంచి పిల్లలు ఏమి అడిగినా లేదనీ చెప్పలేదు. వారికోసం ఆస్తులు కూడా అమ్మి ఇచ్చామని, ఈ సందర్భంగా జీవిత ఎమోషనల్ అయ్యారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మంచి పాత్రలు రావచ్చు రాకపోవచ్చు ఎలాంటి ఫలితాలు వచ్చిన ఏమాత్రం నిరాశ పడకూడదని ధైర్యంగా ఉండాలని తమ కూతుర్లకు జాగ్రత్తలు చెప్పామని ఈ సందర్భంగా జీవిత తన పిల్లల గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం జీవిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…