Surekha Vani: సురేఖ వాణి పరిచయమవసరం లేని పేరు .టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. గతంలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో కూడా ఈమె అక్క పిన్ని వదిన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇక ప్రస్తుతం ఈమె కుమార్తెతో కలిసి సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు తరచూ వెకేషన్ లోకి వెళ్లడం పబ్బులు పార్టీలు అంటూ చాలా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. అయితే ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు చూసిన వారందరూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు సురేఖ వాణి పెద్దగా సినిమాలను కూడా చేయటం లేదు అయితే ఈమె లక్సరీ లైఫ్ గడపడానికి కారణం ఏంటి అనే సందేహాలు అందరికీ ఉన్నాయి.
ఇక సురేఖ వాణి ఇలా లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు అంటే అందుకు కారణం లేకపోలేదని ఈమె బాగా డబ్బున్న వాళ్ళతో ఎఫైర్ కొనసాగించడం వల్లే ఇలా లగ్జరీ లైఫ్ గడుపుతుందంటూ తన గురించి ఎన్నో కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సురేఖ వాడిని స్పందించారు. నేను తెలుగులో సినిమాలు చేయలేదు అంటే మరే సినిమాలు చేయలేదని కాదు అర్థం తమిళ సినిమాలు చేస్తున్నాను తమిళ సినిమాలు చేయడం ద్వారా వచ్చే డబ్బుతో నేను లగ్జరీగా గడుపుతున్నానని తెలిపారు.
రెండో పెళ్లి ఆలోచన లేదు..
ఇలా నేను లగ్జరీగా గడుపుతున్నాను అంటే ఎవరితోనో ఎఫైర్స్ పెట్టుకున్నానని తప్పుడు వార్తలను రాస్తున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తన రెండో పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో కూడా ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. తన భర్త చనిపోయిన సమయంలో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని అప్పుడు నా కూతురు నాకు సహాయం చేసిందని తెలిపారు. ఇక ఇప్పటికీ ఒక్కసారైనా నా భర్త కలలో కనిపిస్తే చాలని నేను తపన పడుతున్నాను అంటూ సురేఖ వాణి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…