Actress Swetha Basu Prasad: శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ శ్వేతా బసు ప్రసాద్ జంటగా తెరకెక్కిన చిత్రం కొత్త బంగారులోకం. ఈ సినిమాలో ఎక్కాడా…ఎక్కాడా అనే డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి శ్వేతా బసు ప్రసాద్ ఎంతో బొద్దుగా తన నటనతో విపరీతమైన అభిమానులను ఆకట్టుకుంది.
ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు తెలుగులో అనంతరం పలు అవకాశాలు వచ్చాయి.ఇకపోతే తెలుగులో తను నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో అవకాశాలు కూడా దూరమయ్యాయి ఈ క్రమంలోనే తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కూడా తనకు అలాంటి అనుభవమే ఎదురయింది.
ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడిన శ్వేతా బసు ప్రసాద్ నిజజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇలా ఒడిదుడుకులను అధిగమించి 2018లో తన ప్రియుడు రోహిత్ మిట్టల్ ను వివాహం చేసుకుంది.వివాహమైన ఏడాది కూడా తిరగకుండానే ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు.
ఈ విధంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న శ్వేతా బసు ప్రసాద్ వెండితెరకు పూర్తిగా దూరమయ్యారు. అయితే వెండితెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.కొత్త బంగారులోకం సినిమాలో ఎంతో బొద్దుగా కనిపించినటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జీరో సైజ్ లోకి మారిపోయారు. ప్రస్తుత ఈమె ఫోటోలు చూస్తే అసలు ఇక్కడ కొత్త బంగారులోకం హీరోయినేనా అనేలా గుర్తుపట్టలేనంతగా తన లుక్ మార్చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…