Movie News

Naga Chaitanya: ఆ సంఘటన చాలా బాధ పెట్టింది… అప్పటినుంచి థియేటర్ కు వెళ్లడం మానేశా: నాగచైతన్య

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఆయన థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తనకు థియేటర్ సెంటిమెంట్ అని అందుకే తాను థియేటర్లో సినిమా చూడడానికి ఇష్టపడనని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే లాల్ సింగ్ చద్దా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయం గురించి నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. అసలు తాను థియేటర్ కి వెళ్లి సినిమా చూడకపోవడానికి ఒక కారణం ఉందని గతంలో జరిగిన ఒక విషయాన్ని బయట పెట్టారు.

తాను మొట్టమొదటిసారిగా నటించిన జోష్ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో చూడటం కోసం థియేటర్ కు వెళ్లారట.ఇలా ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూస్తున్న నాగచైతన్య ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ మొదలయ్యే సరికి జనాలు థియేటర్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడం తనని ఎంతో బాధ పెట్టిందని ఆ సంఘటన ఇప్పటికి తనకు తన మైండ్ నుంచి తొలగిపోలేదని తెలిపారు.

Naga Chaitanya: నా మైండ్ లో ఇప్పటికీ ఆ ఘటన మెదులుతుంది…

ఈ విధంగా ప్రేక్షకులు ఒక్కొక్కరుగా థియేటర్ నుంచి వెళ్లిపోవడంతో తనకు చాలా బాధ కలిగిందని ఆ క్షణమే ఇకపై థియేటర్లో సినిమా చూడకూడదని నిర్ణయించుకున్నానని నాగచైతన్య వెల్లడించారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు తాను థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేదని ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago