Featured

Urvashi Rautela: ప్రేమ గాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

Urvashi Rautela: సాధారణంగా సెలబ్రెటీలు అంటే మీడియా అటెన్షన్ కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. వారు ఏంచేస్తున్నారు…ఎటు వెళ్తున్నారు.. వారి లైఫ్ స్టైల్, ఫ్యామిలీ విషయాలు ఇలా అన్నింటిపై ప్రజలకు ఆసక్తి ఉంటుంది కాబట్టి మీడియా కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇది సినీ రంగంలో ఉన్నవారిపై మరింతగా ఎక్కువగా ఉంటుంది. 

Urvashi Rautela: ప్రేమ గాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

నటినటుల కనిపిస్తే చాలు కెమెరాలతో క్లిక్ మనిపిస్తుంటారు. వారి వ్యక్తిగత జీవితానికి భంగం కలిగిస్తున్నయంటూ.. చాలా సార్లు సెలబ్రెటీలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఊర్వశీ రౌతేలా మెడ మీద ఎర్రటి మరక కనిపించింది. ఇక దీన్ని క్యాప్చర్ చేసిన ఓ వెబ్ సైట్.. తనకు నచ్చిన విధంగా హద్దులు దాటేసి ఊర్వశి మెడపై లవ్ బైట్ అంటూ.. రాసేసింది. 

Urvashi Rautela: ప్రేమ గాటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నటి.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

ఇది చూసిన ఊర్వశి ఘాటుగానే స్పందించింది. సదరు వైబ్ సైట్ న్యూస్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియా వేదికపై ఈ కథనంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

సోషల్ మీడియా వేదకగా ఊర్వశి ఆగ్రహం..


‘హాస్యాస్పదంగా ఉంది! అది నా రెడ్‌ లిప్‌స్టిక్‌, మాస్క్‌ తీస్తూ పెడుతున్నప్పుడు అది నా మెడకు అంటింది. పెదాలకు రెడ్‌ లిప్‌స్టిక్‌ పెట్టుకున్న తర్వాత దాన్ని మెయింటెన్‌ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయిని అడిగినా చెప్తుంది. ఒకరి ప్రతిష్టను దిగజార్చడం కోసం ఏదిపడితే అది రాస్తారా? ఇలాంటి ఫేక్‌ న్యూస్‌లు రాసే బదులు నా విజయాల గురించి రాయొచ్చు కదా?’ అని ట్వీట్‌ చేసింది. అంతేకాదు ఈ అసత్య ప్రచారం చేసినందుకుగానూ తనకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని డిమాండ్‌ చేసింది. ఊర్వశి 2013లో సింగ్‌ సాబ్‌ ద గ్రేట్‌ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. సనమ్‌ రే, గ్రేట్‌ గ్రాండ్‌ మస్తీ, హేట్‌ స్టోరీ 4, పాగల్‌ పంతి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఆమె చివరగా వర్జిన్‌ భానుప్రియ సినిమాలో కనిపించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

7 minutes ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

24 minutes ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

32 minutes ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

56 minutes ago

రుణబాధలు తగ్గాలా? వైశాఖ అమావాస్య రోజు తప్పక చేయాల్సినవి!

2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…

2 hours ago

‘బీజేపీ అహంకారానికి ఈ మంటలే సమాధానం’.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…

3 hours ago