Categories: FeaturedMovie News

Poonam Kour: వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవడం బాధనిపించింది.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ! వెంటనే డెలీట్..

Poonam Kour: పూనమ్ కౌర్.. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితమే. అప్పుడప్పుడు కాంట్రవర్సీలకు దగ్గర అవుతూ.. నెట్టింట ట్రోల్ అవుతూ ఉంటుంది. ఆమె నటించిన సినిమాలకు వచ్చిన ఫేమ్ కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తలో నిలుస్తుంటారు.

Poonam Kour: వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి…పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ !

ఇక ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు.. సినిమాలకు సంబంధించి విషయాలను ఆమె అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇలా ఆమె ఇన్ స్టా, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఇలా చేసిన ట్వీట్లలో ఆమె ఒకానొక సమయంలో వైరల్ అవుతూ ఉంటాయి.

Poonam Kour: వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి…పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ !

తాజాగా ఆమె చేసిన ట్వీట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో సినిమా టికెట్ల ధరలను పెంచాలని ఇండస్ట్రీ పెద్దలు ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే సినీ పెద్దలు ఇటీవల సీఎం జగన్ ను కలిసిన విషయం విధితమే.

ఎంటర్‌‌టైన్మెంట్ రాజకీయాలుగా ..


అయితే అక్కడ సీఎం జగన్ దగ్గర చిరంజీవి లాంటి పెద్ద హీరోలు సీఎం జగన్ ను అభ్యర్థించారు సినిమా టికెట్ల రేట్లను పెంచమని. ఆ సీన్ నచ్చని పూనమ్ ఇలా రాశారు. అందులో ” నేను మనస్పూర్తిగా ఆదరించి, ప్రేమించే వ్యక్తులు.. ఈ పొలిటికల్ లీడర్స్ దగ్గర వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకొని చేతులు కట్టుకొని ఉండడం బాధనిపిస్తోంది. వ్యక్తిత్వం చంపుకోవడం మానేయాలి” అని రాసి దానికి బ్రోకెన్ హార్ట్ సింబల్స్ జోడించింది. అయితే కాసేపటికే ఈ ట్వీట్ ని పూనమ్ డిలీట్ చేసింది. తర్వాత మరో ట్వీట్ చేసింది. అందులో ఇలా రాసి ఉంది. రాజకీయాలు వినోదం గాను, వినోదాలు రాజకీయాలుగా మారుతున్నాయని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్స్ వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago