Adi Pinishetty – Nikki Galraani : దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా తమిళ్ లో హీరోగా నటిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఇటు తెలుగు లో కూడా గుండెల్లో గోదారి, ఒక వి చిత్రం, సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం వంటి చిత్రాలలో నటించి తెలుగులో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ హీరో గా వస్తున్న వారియర్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఆది పినిశెట్టి, తాను ప్రేమించిన నిక్కి గల్రానీ తో మార్చ్ 24న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
తొలిసారి ఆది పినిశెట్టి, నిక్కీ 2015 లో వచ్చిన తమిళ చిత్రం ‘యాగవరాయినమ్ నా కాక్క’లో ఇద్దరు కలిసి నటించారు. ఇదే చిత్రం తెలుగులో కూడా ‘మలుపు’ పేరుతో విడుదలైంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా తరువాత వచ్చిన ‘మరగాధ నాణ్యం’ సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని పెద్ద వాళ్ళతో ఒప్పించి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇపుడు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లితో ఒక్కటయ్యారు.
వివాహ బంధం తో ఒక్కటైన ఆది- నిక్కి…..
కుటుంబ సభ్యుల సమక్షంలో ఆది పినిశెట్టి – నిక్కీగల్రానీల వివాహాం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఎప్పటినుండో ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దలను ఒప్పించి ఎట్టకేలకు చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, అతిథులు, సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. మంగళవారం రాత్రి సంగీత్ కార్యక్రమం ఇంకా బుధవారం ఉదయం హల్దీ వేడుకలతో వీరి వివాహం జరిగింది. ఈ వివాహనికి ఇండస్ట్రీ నుంచి ఆదికి స్నేహితులు అయిన నాని, సందీప్ కిషన్ హాజరు అయినారు. పెళ్లి వేడుకలకు హాజరు అయిన నాని సందీప్ కిషన్ ఇద్దరు హల్దీ అనంతరం ఆది – నిక్కి లతో కలిసి స్టెప్పులేస్తూ అందరిని అలరించారు.
ఇక సినీ ఇండస్ట్రీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల కోసం కొత్త జంట త్వరలోనే రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఆది పినిశెట్టి – నిక్కీగల్రానీ ల వివాహనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూస్తున్న నెటీజన్లు ఆది నిక్కిల జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…