RRR : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమా గా విడుదలైన ఈ చిత్రం ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు వారి నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. మార్చి 20న ఈ సినిమా విడుదల అవుతుంది అని ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ లో విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ లో చూడటానికి పే ఫర్ వ్యూ పద్ధతి ఉంటుంది అని వార్తలు వచ్చాయి.
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన జీ5…..
జీ5 సంస్థ మొదట ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ విడుదలను ప్రకటించినపుడు, పే ఫర్ వ్యూ పద్ధతి ఉంటుంది అని సినిమా చూడటానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అది కూడా మొదటి పది రోజులు మాత్రమే డబ్బులు చెల్లించాలి అని తరువాత మామూలుగానే చూడొచ్చు అని చెప్పింది. కానీ తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా అభిమానులకు జీ5 గుడ్ న్యూస్ చెప్పింది.
సబ్ స్క్రైబ్ చేసుకున్న పే ఫర్ వ్యూ పద్దతి ప్రకారం 100 రూపాయలు చెల్లించాలి అన్న జీ 5 ఇపుడు కాస్త వెనక్కి తగ్గి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున సబ్ స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉచితంగా సినిమా చూడవచ్చు అని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎలాంటి అదనపు చార్జీలు ఉండవను ప్రకటించింది. దీంతో అభిమానులు రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఓటీటీ లో విడుదల అవుతున్న ఆర్ఆర్ఆర్ కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…